సుధీర్‌ను చెప్పుతో కొట్టినా.. ప్రదీప్ ముందే రష్మీ గౌతమ్ ఆ మాట అనేసిందిగా..

సుధీర్ రష్మీ గౌతమ్ ప్రదీప్

Jabardasth Comeday Show : ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో రష్మీ చేసిన వ్యాఖ్యలు హల్‌చల్ చేశాయి. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాలో ప్రదీప్ హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. అదే పేరు మీద సుడిగాలి సుధీర్ స్కిట్ చేశాడు. ఆ స్కిట్‌లో ప్రదీప్ కూడా పాల్గొన్నాడు.

  • Share this:
    సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్.. ఈ ఇద్దరు స్క్రీన్‌పై కనిపిస్తే అభిమానులకు పండగే. రొమాన్స్ అంటే వీళ్లదే అన్నట్లు సాగుతుంది వీళ్ల ప్రేమాయణం. వీళ్లిద్దరు పండించే ప్రేమ స్ర్కీన్‌పైనే అయినా.. నిజంగానే లవ్‌లో ఉన్నారేమోనని అనిపిస్తుంది. కాదని రష్మీ, సుధీర్ తేల్చి చెబుతున్నా.. ప్రేక్షకులు మాత్రం నమ్మడం లేదు. ఎప్పటికప్పుడు గాసిప్స్ సృష్టిస్తూనే ఉన్నారు. ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో అయినా, ఢీ ఛాంపియన్స్ షోలో అయినా.. వీళ్ల రొమాన్స్ పీక్ స్టేజ్‌లో ఉంటుంది. అయితే, అప్పుడప్పుడు స్కిట్‌లో భాగంగా రష్మీ గౌతమ్ చేసే వ్యాఖ్యలు సంచలనం రేపుతుంటాయి. తాజాగా.. గత శుక్రవారం ప్రసారమైన ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో రష్మీ చేసిన వ్యాఖ్యలు హల్‌చల్ చేశాయి.

    30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాలో ప్రదీప్ హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. అదే పేరు మీద సుడిగాలి సుధీర్ స్కిట్ చేశాడు. ఆ స్కిట్‌లో ప్రదీప్ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ప్రదీప్, రష్మీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సుధీర్ తనను ఏడేళ్లుగా ప్రేమిస్తున్నాడని, అతడ్ని వదిలించుకోవడం ఎలా అని ప్రశ్నించింది. అంతేకాదు.. ఛీ అన్నా, చెప్పుతో కొట్టినా, ముఖం మీద ఉమ్మేసినా ప్రేమించడం మానడం లేదని వ్యాఖ్యానించింది. ఈ కామెంట్లు ప్రేక్షకులకు ఫన్‌గా అనిపించాయి. అయితే, సుధీర్-రష్మీ అభిమానులకు కాస్త చేదుగా అనిపించినట్లున్నాయి. అందుకే, రష్మీ మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయద్దొంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: