హోమ్ /వార్తలు /సినిమా /

కమిట్‌మెంట్ ఇచ్చా.. అందుకే వెళ్లానంటున్న రష్మి గౌతమ్..

కమిట్‌మెంట్ ఇచ్చా.. అందుకే వెళ్లానంటున్న రష్మి గౌతమ్..

రష్మి గౌతమ్ హాట్ షో (Image: Rashmi Gautam/Facebook)

రష్మి గౌతమ్ హాట్ షో (Image: Rashmi Gautam/Facebook)

Rashmi Gautam: ఎప్పుడు బాధ్యతగా ఉంటానని చెప్పే రష్మి గౌతమ్ ఓ విషయంలో మాత్రం అడ్డంగా దొరికిపోయింది. ఓ వైపు కరోనా వైరస్ కారణంగా ప్రపంచమే స్థంభించిపోతుంది.

తప్పు ఎప్పుడూ చేయాల్సిన అవసరం లేదు.. ఒక్కసారి చేసి దొరికినా చాలు. ఇప్పుడు రష్మి గౌతమ్ కూడా ఇలాంటి తప్పే చేసింది. ఎప్పుడు బాధ్యతగా ఉంటానని చెప్పే రష్మి గౌతమ్ ఓ విషయంలో మాత్రం అడ్డంగా దొరికిపోయింది. ఓ వైపు కరోనా వైరస్ కారణంగా ప్రపంచమే స్థంభించిపోతుంది. ఎప్పుడు ఎవరు బయటికి వచ్చినా కూడా ఏమవుతుందో అని భయపడుతున్నారు జనాలు. కనీసం పదిమంది కలిసి ఒకేచోట కనిపించినా కూడా పోలీసులు అరెస్ట్ చేస్తామంటున్నారు. మార్చ్ 31 వరకు పెళ్లిళ్లు, గుళ్లు, మసీదులు కూడా మూసేసారు. జనం బయటికి రాకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే.. ఇప్పుడు రష్మి గౌతమ్ మాత్రం తను ఓ షాప్ ఓపెనింగ్‌కు వచ్చింది. పైగా రమ్మని ఆహ్వానించింది కూడా. అది చూసి అంతా విమర్శించారు.

రష్మీ గౌతమ్ Instagram/rashmigautam
రష్మీ గౌతమ్ Instagram/rashmigautam

తప్పు తెలుసుకున్న రష్మి వెంటనే క్షమించమని కోరింది. కరోనా వైరస్ ఉందనే విషయాన్ని కూడా ఈమె మరిచిపోయి నేను వస్తున్నాను.. మీరు కూడా వచ్చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇది చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. బయటకి వెళ్లడానికే భయపడుతున్న జనాన్ని.. తను వస్తున్నాను రమ్మని పిలుస్తుంది రష్మి గౌతమ్. మార్చ్ 20న రాజమండ్రిలో లెనిన్ హౌజ్ ఓపెనింగ్‌కు వచ్చింది రష్మి. దీనికోసం ప్రత్యేకంగా వీడియో బైట్ కూడా ఇచ్చింది ఈమె. అన్నట్లుగానే చాలా మంది అక్కడికి వచ్చారు.

రష్మి గౌతమ్ హాట్ షో (Image: Rashmi Gautam/Facebook)
రష్మి గౌతమ్ హాట్ షో (Image: Rashmi Gautam/Facebook)

కరోనా భయంతో జనాలు గుమిగూడొద్దు అంటూ ప్రభుత్వం హెచ్చరిస్తుంటే.. అందర్నీ రమ్మంటున్నావ్.. బాధ్యత ఉండక్కర్లా రష్మి నీకు అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సీన్ రివర్స్ అయ్యేసరికి కమిట్ మెంట్ ఇచ్చాను కాబట్టి వెళ్లానని.. నిజంగా అంతమంది వస్తారని ఊహించలేదని చెప్పింది ఈమె. తను పిలిచిన వెంటనే అంతమంది రావటం బాధ కలిగించిందని చెప్పింది ఈమె.

రష్మీ గౌతమ్ (Twitter/Photo)
రష్మీ గౌతమ్ (Twitter/Photo)

పోలీసులు ఎన్ని అనుమతులు ఇచ్చినా.. వీళ్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రష్మి చేసింది మాత్రం తప్పే అంటున్నారు కొందరు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే తాను ఓపెనింగ్‌కు వచ్చానని రష్మి చెబుతుంది.. కానీ జాగ్రత్తలు తీసుకుంటే అసలు వెళ్లదు కదా.. ఆ ప్రోగ్రామ్ మరోసారి పెట్టుకోవచ్చుగా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. సామాన్యులతో పోలిస్తే కచ్చితంగా సెలబ్రిటీస్ మరింత జాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేయాల్సింది పోయి ఇలా చేస్తారా అంటున్నారు. ఏదేమైనా కూడా రష్మి సారి చెప్పి కూడా ఇప్పుడు తిట్లు తింటుంది.

First published:

Tags: Anchor rashmi gautam, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు