Home /News /movies /

JABARDASTH ANCHOR RASHMI GAUTAM SAYS I CAN ACT IN INTIMATE SCENES ALSO TA

ఆ సీన్స్ చేయడానికి ఎలాంటి మొహమాటం లేదంటున్న జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్..

రష్మీ గౌతమ్ Photo: Instagram

రష్మీ గౌతమ్ Photo: Instagram

సినిమాల్లో ఇంటిమెంట్ సీన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటోంది ప్రముఖ యాంకర్ కమ్ హీరోయిన్ రష్మీ గౌతమ్. వివరాల్లోకి వెళితే..

    సినిమాల్లో ఇంటిమెంట్ సీన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటోంది ప్రముఖ యాంకర్ కమ్ హీరోయిన్ రష్మీ గౌతమ్. వివరాల్లోకి వెళితే.. తెలుగులో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘హోలి’ సినిమాతో కెరీర్ ప్రారంభించింది రష్మీ గౌతమ్. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా ఎన్నో సినిమాల్లో పాత్రలు చేసిన రష్మీ  గౌతమ్‌కు రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు. కానీ ఎపుడైతే ఎక్స్‌ట్రా జబర్థస్త్ అంటూ రష్మీ చేసిన ఎక్స్‌ట్రా యాంకరింగ్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో రష్మీ గౌతమ్‌ యూత్‌లో ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒక వైపు జబర్థస్త్ యాంకర్‌గా ఉంటూనే  మధ్యలో అడపా డడపా ‘గుంటూరు టాకీస్,అంతకు మించి, చారుశీల,‘నెక్ట్స్ నువ్వే’ వంటి సినిమాలు చేసింది. ఇక‘గుంటూరు టాకీస్’ ‘రాణి గారి బంగళా’ వంటి సినిమాల్లో లిప్‌లాక్స్‌తో పాటు రొమాంటిక్ సీన్స్‌తో సిల్వర్‌ స్క్రీన్‌ను హీటు పుట్టించింది. తాజాగా ఈ భామ ‘శివరంజిని’ సినిమా చేసింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.



    గత చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా రష్మీ గౌతమ్ మరోసారి ఈసినిమాలో రెచ్చిపోయింది. మొత్తానికి తెలుగులో హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు రష్మీ గౌతమే బెస్ట్ ఆప్షన్‌గా మారింది. అందుకే దర్శన, నిర్మాతలు ఇలాంటి సినిమాలకు రష్మీనే తీసుకుంటున్నారు. తాజాగా ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రష్మీ మాట్లాడుతూ.. ఇలాంటి అడల్డ్ కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించడానికి ఎలాంటి మెహమాటం లేదంటోంది. ప్రేక్షకులు నా నుంచి ఎలాంటివి కావాలనుకుంటున్నారో దర్శక,నిర్మాతలు అలాంటి పాత్రలే తీసుకొస్తున్నారంటూ కుండ బద్దలు కొట్టారు. నాగ ప్రభాకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నందు హీరోగా నటించాడు.కమెడియన్ ధన్‌రాజ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాడు. 
    First published:

    Tags: Andhra Pradesh Lok Sabha Elections 2019, Jabardasth comedy show, Rashmi Gautam, Telugu Cinema, Tollywood

    తదుపరి వార్తలు