గుంటూర్ టాకీస్ చేసి తప్పు చేసా.. రష్మి గౌతమ్ సంచలనం..

Rashmi Gautam: రష్మి గౌతమ్.. ఈ పేరుకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు చేసినా.. బుల్లితెరపై కనిపించినా కూడా ఎప్పుడూ ఫుల్ గ్లామర్ ఒలకబోస్తూ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 7, 2020, 9:30 PM IST
గుంటూర్ టాకీస్ చేసి తప్పు చేసా.. రష్మి గౌతమ్ సంచలనం..
గుంటూర్ టాకీస్ సినిమాలో రష్మి గౌతమ్ (rashmi gautam guntur talkies)
  • Share this:
రష్మి గౌతమ్.. ఈ పేరుకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు చేసినా.. బుల్లితెరపై కనిపించినా కూడా ఎప్పుడూ ఫుల్ గ్లామర్ ఒలకబోస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ముందు సినిమాలు.. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో.. అక్కడ్నుంచి మళ్లీ సినిమాల వైపు అడుగేసింది రష్మి. అయితే ఇన్నేళ్ళ తన ప్రయాణంలో సినిమాలు మాత్రం తక్కువగానే చేసింది ఈ భామ. పైగా అన్నీ సెక్స్ రోల్స్ చేస్తూ వచ్చింది రష్మి. ఏమనుకుందో ఏమో కానీ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుండటంతో చాలా వరకు సినిమాలు తగ్గించుకుంటూ వచ్చింది రష్మి.

గుంటూర్ టాకీస్ సినిమాలో రష్మి గౌతమ్ (rashmi gautam guntur talkies)
గుంటూర్ టాకీస్ సినిమాలో రష్మి గౌతమ్ (rashmi gautam guntur talkies)

ఈ క్రమంలోనే ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది ఈమె. ముఖ్యంగా తన కెరీర్ అంతా ఒకే తరహా సినిమాలు చేసానని చెప్పింది రష్మి. దానికి కారణం కూడా ఒక్కటే అని క్లారిటీ ఇచ్చింది. బుల్లితెరపై తనకున్న క్రేజ్ సినిమాల్లో అవకాశాలు తీసుకొచ్చిందని.. అందుకే ఒక్కో సినిమా చేస్తూ వెళ్లానని చెప్పుకొచ్చింది రష్మి. ఈ క్రమంలోనే ప్రవీణ్ సత్తార్ చెప్పిన కారెక్టర్ నచ్చి గుంటూరు టాకీస్ సినిమా చేశానని గుర్తు చేసుకుంది. ఆ సినిమాలో తాను సెక్సీగా .. గ్లామర్ డోస్ పెంచేస్తూ కనిపించడం చూసి అభిమానులు షాక్ అయ్యారు.

గుంటూర్ టాకీస్ సినిమాలో రష్మి గౌతమ్ (rashmi gautam guntur talkies)
గుంటూర్ టాకీస్ సినిమాలో రష్మి గౌతమ్ (rashmi gautam guntur talkies)

అప్పటి వరకు తనను అలా ఎప్పుడూ చూడలేదని.. కానీ ఒక్కసారిగా అలా ఓపెన్ అయ్యేసరికి అంతా షాక్ అయిపోయారని చెప్పుకొచ్చింది రష్మి గౌతమ్. గుంటూర్ టాకీస్‌లో సువర్ణ పాత్ర చేసిన తర్వాత అంతా అలాంటి పాత్రలే రావడం మొదలయ్యాయని.. తాను కూడా చేస్తూ వచ్చానని చెప్పుకొచ్చింది. వైవిధ్యమైన పాత్రలు చేయాలని తనకు కూడా ఉన్నా.. దర్శకులు మాత్రం తనకు అవకాశం ఇవ్వలేదని చెప్పుకొచ్చింది.

గుంటూర్ టాకీస్ సినిమాలో రష్మి గౌతమ్ (rashmi gautam guntur talkies)
గుంటూర్ టాకీస్ సినిమాలో రష్మి గౌతమ్ (rashmi gautam guntur talkies)

అది వాళ్ల తప్పు కూడా కాదు.. ఎందుకంటే గుంటూర్ టాకీస్‌లో తన పాత్ర అలా ఉంటుంది కాబట్టి అంతా అలాగే ఆఫర్ చేసారంటుంది రష్మి. ఓ రకంగా చెప్పాలంటే గుంటూర్ టాకీస్ సినిమాలో ఆ పాత్రను ఒప్పుకుని చాలా పెద్ద పొరపాటు చేశాననే చెప్పాలని అసలు విషయం చెప్పుకొచ్చింది రష్మి గౌతమ్. ఇకపై అలాంటి పాత్రలను ఎలాంటి పరిస్థితుల్లోను ఒప్పుకోనని తెగేసి చెప్పింది జబర్దస్త్ యాంకర్. అందుకే అవకాశాలు వస్తున్నా కూడా సినిమాలు చేయడం లేదని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
First published: May 7, 2020, 9:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading