ఇంకెంత మంది బలి కావాలి...అలీగఢ్ ఘటనపై జబర్దస్త్ రష్మి ఆవేదన

రష్మి గౌతమ్ తన ట్విటర్ వేధికగా ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాల గురించి మరోసారి స్పందించారు. బలమైన చట్టాల రావడానికి.. ఇంకా ఎంత మంది ఇలా బలి కావాలి..అంటూ తన నిస్సాయతను తెలిపారు.

news18-telugu
Updated: June 7, 2019, 4:30 PM IST
ఇంకెంత మంది బలి కావాలి...అలీగఢ్ ఘటనపై జబర్దస్త్ రష్మి ఆవేదన
రష్మీ గౌతమ్
  • Share this:
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ముఖ్యంగా తన ట్విటర్‌ హ్యండిల్‌లో సినిమాలకు సంబందించిన విషయాల కంటే ఎక్కువుగా సమాజం గురించి, చుట్టూ జరుగుతున్న విషయాల గురించి స్పందిస్తూ ఉంటుంది. అయితే వాటిల్లో కూడా ఆమె ముఖ్యంగా మహిళలకు సంబంధించిన విషయాలపై మాట్లాడుతూ ఉంటుంది. మహిళ సాధికారత, వారీ హక్కులపై తన గళం వినిపిస్తూ తన ట్వీటర్ హ్యాండిల్‌‌ను వేదికగా తన స్పందనను తెలియజేస్తుంది రష్మీ. అందులో భాగంగా.. ఆమె గతంలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు, రేప్‌లు గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. రేప్‌లు అమ్మాయిల్నీ, వారి జీవితంలో ఎలా కుంగదీస్తాయో తెలుపుతూ గతంలో ఓ ట్వీట్ కూడా చేసింది. అమ్మాయిలపై రేప్‌లకు కారణం వారు వేసుకుంటున్న మినీ స్కట్స్ అంటూ కొందరు చేస్తున్న విమర్శలపై రష్మీ సీరియస్ అవుతూ.. రేప్ అనే పదం ప్యాన్సీ వర్డ్ కాదు.. దాన్ని జోక్‌గా వాడడం ఎంటని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

తాజగా రష్మి తన ట్విటర్ వేధికగా ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలపై  మరోసారి స్పందించింది. 'బలమైన చట్టాల రావడానికి.. ఇంకా ఎంత మంది ఇలా బలి కావాలి'..అంటూ తన నిస్సాయతను తెలుపుతూ మానవత్వంను రేపే చేసేశారు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది . వివరాల్లోకి వెళ్తే..ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రాంతంలో ట్వింకిల్ శర్మ అనే చిన్నారి హత్య జరిగింది.

అయితే ఈ కేసులో నిందితుడు మహ్మద్ జాహిద్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ హత్యకు కారణం ట్వింకిల్ తల్లిదండ్రులు జాహిద్‌కు రూ. 10వేల రూపాయలు అప్పు ఉన్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవే ఈ హత్యకు దారితీసినట్లు  తెలుస్తోంది.  ఈ ఘటనపై రష్మీతో పాటు పలువురు బాలీవుడ్ నటులు కూడా స్పందించారు.First published: June 7, 2019, 4:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading