హోమ్ /వార్తలు /సినిమా /

అక్కినేని కోడలి ప్లేస్‌కు ఎసరు పెడుతున్న రష్మి గౌతమ్..

అక్కినేని కోడలి ప్లేస్‌కు ఎసరు పెడుతున్న రష్మి గౌతమ్..

రష్మీ గౌతమ్ (Instagram/Rashmi Gautam)

రష్మీ గౌతమ్ (Instagram/Rashmi Gautam)

Rashmi Gautam: అవును.. నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే జరుగుతుందిప్పుడు. నిజంగానే అక్కినేని కోడలు ప్లేస్‌కు ఎర్త్ పెడుతుంది రష్మి గౌతమ్. జబర్దస్త్ యాంకర్‌గానే..

అవును.. నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే జరుగుతుందిప్పుడు. నిజంగానే అక్కినేని కోడలు ప్లేస్‌కు ఎర్త్ పెడుతుంది రష్మి గౌతమ్. జబర్దస్త్ యాంకర్‌గానే అందరికీ పరిచయమైన ఈ బ్యూటీలో మరో కోణం కూడా ఉంది. సామాజిక బాధ్యత కూడా బాగానే చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు ఏ కష్టమొచ్చినా కూడా ముందుండి నడిపిస్తుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియా వేదికగా అన్నీ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది రష్మి. ఇక ఇప్పుడు లాక్ డౌన్ సందర్భంగా కూడా రోజూ ట్వీట్స్ చేస్తూనే ఉంది రష్మి. ముఖ్యంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా వెంటనే వెళ్లి స్పందించండి.. సాయం చేయండి.. ఈ టైమ్‌లో కూడా సాయం చేయకపోతే మనం మనుషులమే కాదంటుంది ఈమె.

రష్మి గౌతమ్ ఫైల్ ఫోటో (Rashmi Gautam)
రష్మి గౌతమ్ ఫైల్ ఫోటో (Rashmi Gautam)

అక్కడితో ఆగడం లేదు.. జంతువుల గురించి రష్మి తీసుకుంటున్న జాగ్రత్తలు.. వాటి కోసం ఈమె పడుతున్న శ్రమను చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. మనుషులు కాబట్టి మన ఆకలితో పాటు అన్నీఎలాగోలా చెప్పుకుంటాం.. కానీ జంతువులు అలా కాదు కదా అంటుంది. ఈ లాక్ డౌన్ సమయంలో వాటికి కూడా తిండి చాలా కష్టం అయిపోతుంది.. కాబట్టి వాటి ఆకలిని తీర్చే బాధ్యత కొంతవరకు నేను తీసుకుంటున్నాను అంటుంది రష్మి.

రష్మి గౌతమ్ అమల అక్కినేని (rashmi gautam amala akkineni)
రష్మి గౌతమ్ అమల అక్కినేని (rashmi gautam amala akkineni)

అందుకే కుక్కలతో పాటు పిల్లులు ఇలా వీధిలో ఉండే జంతువులకు ఫుడ్ సప్లై చేస్తుంది రష్మి గౌతమ్. వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తెలుగు ఇండస్ట్రీలో జంతువుల ప్రేమ అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు అమల అక్కినేని. ఈమె జంతు పరిరక్షణ కోసం కొన్నేళ్లుగా పాటు పడుతూనే ఉంది. ఇప్పుడు ఈమె స్థానంలోకి రష్మి గౌతమ్ వచ్చేలా కనిపిస్తుంది. ఆమె మాదిరే అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. మూగ జీవాలను ప్రేమించడం నేర్చుకోండి.. మనుషులు అనిపించుకోండి అంటుంది ఈ జబర్దస్త్ యాంకర్.

First published:

Tags: Amala Akkineni, Anchor rashmi gautam, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు