బోరుబావిలో చిన్నారికోసం రష్మీ ప్రార్థనలు... ఫ్యాన్స్ ఫిదా

రష్మీ గౌతమ్

చిన్నారి కోసం ప్రార్థనలు చేయాలంటూ తన అభిమానుల్ని కోరింది. దీంతో రష్మీ చేసిన పనికి ఆమెఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

  • Share this:
    బోరుబావిలో పడ్డ చిన్నారి సుర్జిత్ విషయమై ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ ట్వీట్ చేసింది. ‘హార్ట్ బ్రేకింగ్ న్యూస్... మన సానుకూల దృక్పథం, ప్రార్థనల వల్ల ఫలితం అద్భుతంగా ఉంటుంది. చిన్నారి కోసం ప్రతీ ఒకరు ప్రార్థించండి’ అంటూ రష్మీ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే రష్మీ... సామాజిక అంశాల పట్ల స్పందిస్తూ ఉంటుంది. తమిళనాడు తిరుచ్చాపల్లిలో బోరుబావిలో పడ్డ చిన్నారి విషయంలో కూడా రష్మీ అంతే బాధ్యతతో స్పందించింది. చిన్నారి కోసం ప్రార్థనలు చేయాలంటూ తన అభిమానుల్ని కోరింది. దీంతో రష్మీ చేసిన పనికి ఆమెఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

    అటు తమిళనాడులో ఈ ఘటనపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. చిన్నారి సుర్జిత్ క్షేమంగా బయటకు రావాలని ఆయన భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాన్నారు. ఆయన తర్వాత టాలీవుడ్‌లో ఎవరూ ఈ ఘటనపై స్పందించలేదు. మొట్టమొదటిసారిగా రష్మీ మాత్రమే బోరుబావి ఘటనపై స్పందంచడంతో ఆమె అభిమానులంతా రష్మీ సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు.

    మరోవైపు తమిళనాడులో బోరుబావిలో పడిన చిన్నారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నాలుగరోజులుగా బోరుబావిలో ఉన్న రెండేళ్ల సుర్జిత్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో సుర్జీత్ క్షేమంగా రావాలంటూ ప్రతీ ఒకరు భగవంతుడికి ప్రార్థిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి బోరుబావిలో పడిపోయాడు. తమిళనాడు తిరుచ్చాపల్లిలో ఈ ఘటన జరిగింది.

    First published: