తెలుగు బుల్లితెరపై కొన్ని జంటలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందులో సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ కూడా ఒకటి. వాళ్లిద్దరూ జంటగా కనిపిస్తే చాలు రేటింగ్స్ అద్భుతంగా ఉంటాయి. సుధీర్, రష్మి అంటేనే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వాళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుందని.. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని.. పెళ్లి చేసుకుంటారని రోజుకో వార్త వస్తూనే ఉంటుంది. యూ ట్యబ్ జోడీ అంటూ ఈ ఇద్దరిపై ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. వాటిపై సుధీర్, రష్మి కూడా పెద్దగా పట్టించుకోరు. ఎవరి పనులు వాళ్లు చూసుకుంటారు. ఇప్పటికే వీళ్ల రిలేషన్‌పై జబర్దస్త్ కమెడియన్స్ కూడా చాలా మంది క్లారిటీ ఇచ్చారు.
వాళ్లది జస్ట్ ఫ్రెండ్ షిప్ మాత్రమే అని చెప్పారు. అయినా కూడా బుల్లితెరపై వాళ్ల రొమాన్స్ చూసిన తర్వాత ఎవరూ అలా అనుకోరు.. అంతకుమించి అనుకుంటారు. అయితే ఇప్పుడు స్వయంగా రష్మి గౌతమ్ ఈ బంధంపై మాట్లాడింది. తమ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని అంతా అనుకుంటారని.. ఇద్దరం ప్రేమించుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై కూడా ఈమె స్పందించింది. నిజానికి తామిద్దరి మధ్య ఏం లేదని.. కేవలం యాక్టర్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. స్క్రీన్‌పై మీరేదైతే చూస్తారో అంతా నటన మాత్రమే అని.. ఆ సమయంలో తామిద్దరం కేవలం నటులం మాత్రమే అని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ.
మీరంతా అనుకుంటున్నట్లు సుధీర్, నేను బెస్ట్ ఫ్రెండ్స్ కూడా కాదని మరో షాక్ ఇచ్చింది రష్మి. కేవలం స్నేహితుడు మాత్రమే.. షూటింగ్ అయిపోయిన తర్వాత హాయ్, బై చెప్పుకునే స్నేహితుడు మాత్రమే అని షాకింగ్ న్యూస్ చెప్పింది. తమ ఇద్దరి మధ్య ఉన్న ఈ డీసెంట్ ఫ్రెండ్ షిప్‌కు కూడా ఏదేదో పేర్లు పెట్టడం మంచిది కాదని చెప్పుకొచ్చింది రష్మి గౌతమ్. తమ మధ్య ఏం లేదని.. ఎన్నిసార్లు చెప్పినా కూడా అలాగే చేస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పింది ఈ జబర్దస్త్ యాంకర్. మరి ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాతైనా రష్మి, సుధీర్ మధ్య గాసిప్స్ ఆగుతాయేమో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi gautam, Jabardasth comedy show, Sudigali sudheer, Telugu Cinema, Tollywood