జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్‌కు బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్‌కు ఏ మాత్రం తక్కువ కానీ రేంజ్‌లో ఈమె అందాలను ఆరబోస్తుంది. అలాగే క్రేజ్ కూడా సంపాదించుకుంది. వరస సినిమాలతో పాటు టీవీ షోలతో బిజీగా ఉంది రష్మి గౌతమ్. ఈమె డేట్స్ కోసం చిన్న నిర్మాతలు క్యూ కడుతున్నారు. అంతగా తన మార్కెట్ సంపాదించుకుంది. ఎందుకంటే చిన్న సినిమాలకు ఈమె కేరాఫ్ అడ్రస్. కేవలం రష్మి గౌతమ్ బొమ్మేసుకుని మార్కెట్ చేసుకున్న సినిమాలు బోలెడున్నాయి. గుంటూరు టాకీస్ నుంచి మొదలైంది ఈ రచ్చ. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమె పెళ్లి గురించి కూడా సోషల్ మీడియాలో టాపిక్ మొదలైంది. అన్నింకంటే ముందు సుడిగాలి సుధీర్‌తో ఈమెకు ఎఫైర్ నడుస్తుందనే వార్తలు వచ్చినా కూడా అందులో నిజం లేదని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. అది కేవలం స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. దాంతో సుధీర్, రష్మి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే కానీ ప్రేమ కాదని కన్ఫర్మ్ చేసారు. ఇదిలా ఉంటే రష్మి వయసు కూడా దాదాపు 38 వరకు ఉంటుందని అంచనా. ఎందుకంటే దాదాపు 18 ఏళ్ళ కిందే ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన హోళీ సినిమాలో కీలక పాత్రలో నటించింది రష్మి. అప్పుడు కనీసం 17 ఏళ్లున్నా కూడా ఇప్పుడు ఈమెకు 35 దాటిపోయింది. అయినా కూడా ఇప్పటికీ పెళ్లి మాటలే ఎత్తడం లేదు రష్మి.
ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈమెను పెళ్లి గురించి అడిగారు. దానికి చాలా క్లారిటీగా సమాధానం చెప్పింది రష్మి గౌతమ్. తనకు ఇప్పట్లో అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని తేల్చేసింది. తనకు ఇంకా చేయాల్సింది చాలా ఉందని.. సోషల్ సర్వీస్ కూడా చేయాలని ఉందని పెళ్లి అంటూ కూర్చుంటే అవన్నీ పూర్తి కావని.. అందుకే అన్నీ సాధించిన తర్వాతే పెళ్లి వైపు వెళ్తానంటుంది.
ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే మాట కూడా లేదని.. అలాంటి ఆలోచన కూడా చేయడం లేదని కన్ఫర్మ్ చేసింది. మరోసారి తనను పెళ్లి గురించి అడగాల్సిన అవసరం లేకుండా మొహం మీదే చెప్పుకొచ్చింది ఈ జబర్దస్త్ భామ. అన్నట్లు ఇప్పుడు సినిమాల కంటే కూడా ఎక్కువగా టెలివిజన్‌పైనే ఫోకస్ చేసింది రష్మి. మరోవైపు డిజిటల్‌లో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi gautam, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood