హోమ్ /వార్తలు /సినిమా /

మమ్మల్ని కాస్త బతకనీయండి.. రష్మి గౌతమ్ ఆవేదన..

మమ్మల్ని కాస్త బతకనీయండి.. రష్మి గౌతమ్ ఆవేదన..

రష్మి గౌతమ్ Instagram/rashmigautam

రష్మి గౌతమ్ Instagram/rashmigautam

Rashmi Gautam: ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ లాంటి షోస్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన బ్యూటీ రష్మి గౌతమ్. ప్రస్తుతం అన్ని షూటింగ్స్ ఆగిపోవడంతో హాయిగా తనకు నచ్చిన పని చేసుకుంటూ కాలం గడుపుతుంది రష్మి.

ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ లాంటి షోస్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన బ్యూటీ రష్మి గౌతమ్. ప్రస్తుతం అన్ని షూటింగ్స్ ఆగిపోవడంతో హాయిగా తనకు నచ్చిన పని చేసుకుంటూ కాలం గడుపుతుంది రష్మి. తన చుట్టూ ఉన్న మూగజీవాల యోగ క్షేమాలు చూస్తూ.. అప్పుడప్పుడూ అభిమానులతో మాట్లాడుతూ టైమ్ పాస్ చేస్తుంది. ఈ క్రమంలోనే అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు ఏ మాత్రం మొహమాటం లేకుండా సమాధానం చెబుతుంది. ఇప్పటికే గుంటూర్ టాకీస్ సినిమా చేసి తప్పు చేసానని చెప్పిన రష్మి.. సుధీర్ తనకు కేవలం హాయ్, బై చెప్పే స్నేహితుడు మాత్రమే అని చెప్పుకొచ్చింది.

రష్మీ గౌతమ్ Instagram/rashmigautam
రష్మీ గౌతమ్ Instagram/rashmigautam

ఇక ఇప్పుడు మరో విషయం కూడా చెప్పింది రష్మి గౌతమ్. తను చేస్తున్న షూటింగులు నిలిచిపోవడంతో కొత్త ఎపిసోడ్స్ టెలికాస్ట్ కావడం లేదు. ఈ షోలు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయనేది కూడా ఇప్పట్లో తెలిసేలా కనిపించడం లేదు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని కూడా దీనికి సమాధానం చెప్పలేదు. జూన్ వరకు ఓపిక పట్టాల్సిందే అన్నాడు. అయితే ఇప్పుడు రష్మిని కూడా ఇదే ప్రశ్న అడిగారు అభిమానులు.

రష్మీ గౌతమ్ Instagram/rashmigautam
రష్మీ గౌతమ్ Instagram/rashmigautam

ఎప్పుడు మీ షోస్ మళ్లీ తిరిగి మొదలవుతాయి.. షూటింగ్ ఎప్పట్నుంచి అని.. దీనికి జబర్దస్త్ బ్యూటీ కూడా భిన్నంగా సమాధానం చెప్పింది. ఈ షోలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయని మాత్రం అడగొద్దు.. ఇప్పుడు ఈ ప్రశ్నలు ఆపేయండి.. ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాము కూడా తమ కుటుంబాలను.. జీవితాలను ప్రేమిస్తామని.. దయచేసి తమను కూడా సేఫ్‌గా ఉండనివ్వండి అంటూ రష్మి గౌతమ్ సమాధానమిచ్చింది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anchor rashmi gautam, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు