హోమ్ /వార్తలు /సినిమా /

రష్మీ నా లైఫ్.. దాన్ని వదిలేదు లేదు.. సుడిగాలి సుధీర్ కామెంట్స్..

రష్మీ నా లైఫ్.. దాన్ని వదిలేదు లేదు.. సుడిగాలి సుధీర్ కామెంట్స్..

Jabardasth : స్క్రీన్‌పై తన హీరోయిన్ రష్మీ మాత్రమేనని, ఎవ్వరూ వచ్చినా ఒప్పుకోనని, తను నా లైఫ్ అని సుడిగాలి సుధీర్ వ్యాఖ్యానించాడు. రష్మీ వల్లే తనకు ఇంత పేరు వచ్చిందని, ఓ రకంగా తాను స్టార్‌డమ్ సంపాదించడానికి రష్మీనే కారణమని వెల్లడించాడు.

ఇంకా చదవండి ...

  రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్.. బుల్లి తెర ప్రేమ పక్షులు. వీరిద్దరు ఏ షోలో కనిపిస్తే ఆ షోకు జోష్ వస్తుంది. వీక్షకుల్లో క్యూరియాసిటీ పెరుగుతుంది. కెమెరా ముందుకు వచ్చారంటే వీళ్లు ఏం మాట్లాడుతారోనని, ఎంత రొమాన్స్ పండిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందుకే వీరి కెమిస్ట్రీ గురించి బుల్లితెరపైనే కాదు.. సినిమాల్లోనూ మాట్లాడుకుంటారు. అంతకుమించి సోషల్ మీడియాలో బోలెడన్ని వదంతులు పుట్టుకొస్తాయి. అయితే.. తాము పండించే రొమాన్స్ అంతా ఆన్ స్క్రీన్‌ మీదేనని, ఆఫ్ స్క్రీన్‌లో ఎవరి జీవితాలు వారివేనని చెబుతూ వస్తున్నారు. వ్యక్తిగత జీవితాల్లో ఎవ్వరినీ ఎవ్వరం డిస్టర్బ్ చేసుకోమని స్పష్టం చేశారు. తాజాగా, సుధీర్ అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అలీ వేసిన ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. స్క్రీన్‌పై తన హీరోయిన్ రష్మీ మాత్రమేనని, ఎవ్వరూ వచ్చినా ఒప్పుకోనని, తను నా లైఫ్ అని వ్యాఖ్యానించాడు. రష్మీ వల్లే తనకు ఇంత పేరు వచ్చిందని, ఓ రకంగా తాను స్టార్‌డమ్ సంపాదించడానికి రష్మీనే కారణమని వెల్లడించాడు.

  ఒకప్పుడు తాము సెట్‌లో మాత్రమే కలిసేవాళ్లమని, ఈ మధ్య అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటామని అన్నాడు. కెమెరా వెనకాల కూడా రష్మీ తిడుతుందా అని అలీ అడగ్గా.. ఇష్టమొచ్చినట్లు తిడుతుందని చెప్పాడు సుధీర్. తెలుగు రాదు కదా అని అడగ్గా.. వచ్చిన భాషలో తిడుతుందని వెల్లడించాడు. రష్మీ తన జీవితంలో ఎన్నో కష్టాలు పడిందని, ఆమె పడ్డ కష్టాలు తెలిశాక ఆమెపై గౌరవం అమాంతం పెరిగిందని సుధీర్ చెప్పాడు. ఆమె పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కిందని తాను అనుకుంటున్నానని వివరించాడు.

  కాగా, జబర్దస్త్‌ను విడిచిపెడతావని వార్తలు వచ్చాయని అలీ అడగ్గా.. తాను దాన్ని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. ఒక వేళ వెళ్లాల్సి వస్తే జబర్దస్త్ నిర్వాహకులైన మల్లెమాల ప్రొడక్షన్స్‌ వాళ్లను అడుగుతానని, వాళ్లు వెళ్లొద్దని అంటే వెళ్లనని ఖరాఖండీగా చెప్పేశాడు. ఈ మధ్య ఓ ఆఫర్ వచ్చిందట అని అడగ్గా.. ఇప్పటికైతే జబర్దస్త్‌ను వీడబోనని తేల్చి చెప్పాడు సుడిగాలి సుధీర్.

  First published:

  Tags: Jabardasth comedy show, Nagababu, Rashmi Gautam, Sudigali sudheer, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు