తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ కంటే రొమాంటిక్ కపుల్ మరోటి ఉండదేమో..? వాళ్లు కనిపిస్తే చాలు టిఆర్పీ రేటింగ్స్ కూడా పరుగులు తీస్తూ వస్తుంటాయి. అందుకే వాళ్లతో ప్రోగ్రామ్స్ చేయడానికి ఛానెల్స్ కూడా పోటీ పడుతుంటాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు సుధీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది రష్మి గౌతమ్. ఏడేళ్లుగా ఈ ఇద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు. పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకునేంత సాన్నిహిత్యం ఈ ఇద్దరి మధ్య ఉందంటారు కొందరు వాళ్ల కామన్ ఫ్రెండ్స్. అయితే వాళ్లు కేవలం స్నేహితులు మాత్రమే అని.. అంతకుమించి యూ ట్యూబ్, సోషల్ మీడియాలో వచ్చినట్లు ఎలాంటి రిలేషన్ లేదని చెప్తుంటారు. ఎప్పటికప్పుడు ఏ కార్యక్రమం అయినా కూడా ఈ ఇద్దరిపైనే ప్రోమో కట్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే చేసారు. తాజాగా ఢీ కొత్త సీజన్ కోసం రష్మి, సుధీర్ మధ్య రిలేషన్‌ను మరోసారి వాడుకున్నారు నిర్వాహకులు. ఇదిలా ఉంటే తాజాగా ఢీ కొత్త సీజన్ కోసం రష్మి, సుధీర్ జంటను విడదీసారు నిర్వాహకులు. కొన్ని సీజన్స్ నుంచి ఇద్దరూ ఒకే టీంలో ఉన్నారు. టీం లీడర్స్‌గా ఉంటూ కామెడీతో పాటు డాన్సులు చేస్తూ అలరిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్త సీజన్‌లో మాత్రం ఒకే టీం నుంచి విడిపోయి రెండు సపరేట్ టీమ్స్ అయిపోయారు. తాజాగా 'కింగ్స్ వర్సెస్ క్వీన్స్' అనే కాన్సెప్ట్‌తో 'ఢీ 13' ప్రారంభం కానుంది. ప్రోమో కూడా వచ్చిందిప్పుడు. ఎప్పట్లాగే శేఖర్ మాస్టర్, ప్రియమణి, పూర్ణ జడ్జిలుగా.. హైపర్ ఆది, సుధీర్, రష్మి టీమ్ లీడర్స్‌గా ఉన్నారు. వర్షిణి ప్లేస్‌లో మాత్రం టిక్ టాక్ ఫేమ్ దీపిక పిల్లై వచ్చింది. ఇదిలా ఉంటే టీం లీడర్స్ అంతా కలిసి డాన్సులు చేసారు. ఆ తర్వాత 'సెలబ్రేషన్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఈ రౌండ్‌లో ఎవరు గెలిచారో ఎవరికీ తెలీదు' అని ప్రదీప్ అనగానే.. 'కాదు ప్రదీప్.. ఎంత పోటీ ఉన్నాసరే అందరం కలిసి డ్యాన్స్ చేస్తే వచ్చే కిక్కే వేరు' అని రష్మి చెప్పింది.
ఆ తర్వాత ఊరికే ఉండకుండా ఎంతైనా కూడా సుధీర్‌ను మిస్ అవుతున్నానబ్బా.. ఐ మిస్ యు సుధీర్ అంటూ వయ్యారంగా చెప్పుకొచ్చింది రష్మి గౌతమ్. ఆ మాట వినగానే సుధీర్ కూడా మెలికలు తిరిగిపోయాడు. 'నిన్ను తరచూ మిస్ అవుతూనే ఉంటాను నా అదృష్ట దేవత' అంటూ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. వీళ్లిద్దరి మాటలు విన్న తర్వాత పక్కనే ఉన్న హైపర్ ఆది.. వీళ్లిద్దరికీ వెంటనే పెళ్లి చేసేయండి నాన్నా అంటూ చెప్పుకొచ్చాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi gautam, Sudigali sudheer, Telugu Cinema, Tollywood