Home /News /movies /

Hyper Aadi Rashmi Gautam: హైపర్ ఆది పొలంలో మొలకలు వచ్చాయంట.. రష్మి గౌతమ్ సాక్ష్యం..

Hyper Aadi Rashmi Gautam: హైపర్ ఆది పొలంలో మొలకలు వచ్చాయంట.. రష్మి గౌతమ్ సాక్ష్యం..

జబర్దస్త్ హైపర్ ఆది (Jabardasth hyper aadi)

జబర్దస్త్ హైపర్ ఆది (Jabardasth hyper aadi)

Hyper Aadi Rashmi Gautam: హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్‌లో మనోడికి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో మాటలు చెప్పనక్కర్లేదు. ఆది స్కిట్ వచ్చిందంటే చాలు వచ్చే రెస్పాన్స్‌లోనే అర్థమవుతుంది.

హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్‌లో మనోడికి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో మాటలు చెప్పనక్కర్లేదు. ఆది స్కిట్ వచ్చిందంటే చాలు వచ్చే రెస్పాన్స్‌లోనే అర్థమవుతుంది. యూ ట్యూబ్‌లో ఈయన స్కిట్స్‌కు వచ్చే వ్యూస్ ఆది రేంజ్ ఏంటి అనేది చూపిస్తుంటాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయనపై రష్మి గౌతమ్ అదిరిపోయే కామెంట్స్ చేసింది. అయినా రష్మి ఎక్కడ్నుంచి వచ్చింది.. చేస్తే గీస్తే అనసూయ భరద్వాజ్ కదా కామెంట్స్ చేయాలి.. ఎందుకంటే హైపర్ ఆది ఉండేది జబర్దస్త్‌లో కానీ ఎక్స్ ట్రాలో కాదు కదా అనుకుంటున్నారా..? అప్పుడప్పుడూ ఇక్కడి వాళ్లు అక్కడ వాళ్ల ఇక్కడ కనిపిస్తుంటారు. గెస్ట్ అప్పియరెన్సులు ఇస్తుంటారు. తమ స్కిట్స్ కోసం పక్క టీం లీడర్స్‌ను తీసుకొస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా తన స్కిట్ కోసం హైపర్ ఆదిని తన టీంలోకి అతిథిలా ఆహ్వానించాడు రాకేష్. అందులో వచ్చీ రాగానే తన పంచుల వర్షం మొదలు పెట్టాడు ఆది.
జబర్దస్త్ హైపర్ ఆది (Jabardasth hyper aadi)
జబర్దస్త్ హైపర్ ఆది (Jabardasth hyper aadi)

ఓ లేడీతో డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చాడు హైపర్ ఆది. అది చూడగానే రష్మి గౌతమ్ సెటైర్ వేసింది. ఆది నీ పొలంలో కూడా మొలకలొచ్చాయి అంటూ రష్మి డైలాగ్ విసిరింది. అది చూసి హైపర్ ఆది కూడా సిగ్గు పడ్డాడు. ఆ వెంటనే స్కిట్‌లోకి వెళ్లిపోయాడు. అందులో ఆవిడ ఇవాళ మన పెళ్లిరోజు.. ఆ రోజు గుర్తుందా అంటే గుర్తుంది ఆ రోజు తర్వాత ఏ రోజూ గుర్తు లేకుండా పోయిందంటూ సెటైర్ వేసాడు. ఎప్పుడూ జబర్దస్త్‌లోనే కనిపించే ఆది ఎక్స్ ట్రా జబర్దస్త్‌కు రావడంతో రెస్పాన్స్ కూడా అదిరిపోయింది.

ముఖ్యంగా రాకేష్ ఈ మధ్య వరసగా బయట గెస్టులను తెచ్చుకుంటున్నాడు. కరోనా వైరస్ కారణంగా చిన్న పిల్లలు షూటింగ్‌కు రాకూడదనే నిబంధన ఉండటంతో మనోడు బయటి నుంచి వేర్వేరు గెస్టులను తెచ్చుకుంటున్నాడు. అందులో భాగంగానే ప్రతీవారం బయటి వాళ్లపైనే ఆధారపడుతున్నాడు. ఈ వారం హైపర్ ఆదిని అరువు తెచ్చుకున్నాడు. ఎప్పట్లాగే వచ్చీ రాగానే దుమ్ము దులిపేసాడు ఆది. తన హైపర్ పంచులతో అందర్నీ నవ్వించేసాడు. జబర్దస్త్‌లో అనసూయతో ర్యాపో కుదిరినట్లు ఇక్కడ రష్మితో పంచులు వేసాడు ఆది. మరి ప్రోమోతోనే ఇంతగా నవ్విస్తే.. ఫుల్ ఎపిసోడ్ వస్తే రచ్చ రచ్చ అవుతుందేమో..?
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anchor rashmi gautam, Hyper Aadi, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు