జబర్దస్త్ యాంకర్‌గానే అందరికీ పరిచయమైన ఈ బ్యూటీలో మరో కోణం కూడా ఉంది. సామాజిక బాధ్యత కూడా బాగానే చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు ఏ కష్టమొచ్చినా కూడా ముందుండి నడిపిస్తుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియా వేదికగా అన్నీ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది రష్మి. ఇప్పుడు లాక్ డౌన్ సందర్భంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా వెంటనే వెళ్లి స్పందించండి.. సాయం చేయండి.. ఈ టైమ్‌లో కూడా సాయం చేయకపోతే మనం మనుషులమే కాదంటుంది ఈమె. అక్కడితో ఆగడం లేదు.. జంతువుల గురించి రష్మి తీసుకుంటున్న జాగ్రత్తలు.. వాటి కోసం ఈమె పడుతున్న శ్రమను చూసి అంతా ఫిదా అయిపోతున్నారు.
@rashmigautam27 I saw ur insta stories .thats great job by the way .one thing I didn’t like is ,please dnt use that news papers while feeding dogs it’s contains an black ink and it’s harmful substance . So please I request u to inform your people an alternative.
— varun kumar (@varunku39709324) April 11, 2020
మనుషులు కాబట్టి మన ఆకలితో పాటు అన్నీఎలాగోలా చెప్పుకుంటాం.. కానీ జంతువులు అలా కాదు కదా అంటుంది. ఈ లాక్ డౌన్ సమయంలో వాటికి కూడా తిండి చాలా కష్టం అయిపోతుంది.. కాబట్టి వాటి ఆకలిని తీర్చే బాధ్యత కొంతవరకు నేను తీసుకుంటున్నాను అంటుంది రష్మి. అందుకే కుక్కలతో పాటు పిల్లులు ఇలా వీధిలో ఉండే జంతువులకు ఫుడ్ సప్లై చేస్తుంది రష్మి గౌతమ్. వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇదంతా చూసిన ఓ నెటిజన్.. కుక్కులకు ఫుడ్ పెట్టేటప్పుడు న్యూస్ పేపర్ వాడొద్దు.. అందులో కెమికల్ ఉంటుంది.. అది వాటి ఆరోగ్యానికి మంచిది కాదంటూ సలహా ఇచ్చాడు.
There is no alternative as of now
— rashmi gautam (@rashmigautam27) April 11, 2020
No one was expecting a pandemic or the situation to get this bad
Arranging rice and dog food itself is a huge task I think u shud appreciate them for doing what they are doing
Dogs generally eat from drains and garbage so trust me tis is good https://t.co/JpOG8KtLoD
అది విన్న రష్మి గౌతమ్.. కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడున్న పరిస్థితిని ఎవరూ ఊహించలేదు.. కుక్కలకు ఫుడ్ పెట్టడమనేదే పెద్ద టాస్క్.. అది వాళ్లు చేస్తున్నారు.. దాన్ని చూసి మీరు సంతోషపడండి చాలు.. ఇలాంటి సమయంలో సలహాలు ఇవ్వడం ఈజీనే అంటూ కాస్త సెటైరికల్‌గానే రెచ్చిపోయింది జబర్దస్త్ యాంకర్. నన్ను నమ్మండి.. వాటికేం కాదు అంటూ చివర్లో కాస్త మందు కూడా రాసింది రష్మి గౌతమ్. తెలుగు ఇండస్ట్రీలో జంతువుల ప్రేమ అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు అమల అక్కినేని. ఈమె జంతు పరిరక్షణ కోసం కొన్నేళ్లుగా పాటు పడుతూనే ఉంది. ఇప్పుడు ఈమె స్థానంలోకి రష్మి గౌతమ్ వచ్చేలా కనిపిస్తుంది. ఆమె మాదిరే అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. మూగ జీవాలను ప్రేమించడం నేర్చుకోండి.. మనుషులు అనిపించుకోండి అంటుంది ఈ జబర్దస్త్ యాంకర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.