మానవత్వం చచ్చిపోయింది.. నెల్లూరు ఘటనపై రష్మి గౌతమ్ సీరియస్..

Rashmi Gautam: సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ఓ వైపు పెరిగిపోతున్న కరోనా వైరస్‌ను అరికట్టడానికి డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులతో పాటు పోలీసులు కూడా అహర్నిషలు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 30, 2020, 5:00 PM IST
మానవత్వం చచ్చిపోయింది.. నెల్లూరు ఘటనపై రష్మి గౌతమ్ సీరియస్..
రష్మి గౌతమ్ ఫైల్ ఫోటో (rashmi gautam)
  • Share this:
సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ఓ వైపు పెరిగిపోతున్న కరోనా వైరస్‌ను అరికట్టడానికి డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులతో పాటు పోలీసులు కూడా అహర్నిషలు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎవరి జాగ్రత్తలు వాళ్లు చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అందుకే అంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం కూడా చెప్పింది. తాజాగా ఈ మాస్క్ విషయంలోనే ఓ మనిషిలోని రాక్షసుడు బయటికి వచ్చాడు. కేవలం మాస్క్ ధరించాలని చెప్పినందుకు తన కిందిస్థాయి ఉద్యోగినిని కనీసం వికలాంగురాలని చూడకుండా ఓ కీచకుడు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించాడు.


నెల్లూరు జిల్లా పర్యాటకాభివృద్ధి సంస్థలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌ భాస్కర రావు చేసిన ఈ పనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తన కింది స్థాయి మహిళా ఉద్యోగినిపై ప్రతాపాన్ని చూపాడు ఈ కీచకుడు. జూన్ 27న జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది. మాస్క్ ధరించకుండా విధులకు హాజరైన భాస్కర రావు.. అలాగే తన కింది స్థాయి ఉద్యోగులతో సమావేశం అయ్యాడు. దీన్ని చూసిన ఉద్యోగిని ఒకరు.. మాస్క్ ధరించాలని సూచించింది. దీంతో మండి పడ్డ భాస్కర రావు ఆమెపై దాడికి పాల్పడ్డాడు.
మహిళను అత్యంత దారుణంగా ఈడ్చి కింద పడేసి అందరూ చూస్తుండగానే రాడ్ తీసుకుని కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏకంగా నేషనల్ మీడియా కూడా దీన్ని ప్రసారం చేసింది. సదరు మహిళకు న్యాయం చేయాలని ఏప్రీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మహిళను అత్యంత కిరాతకంగా కొడుతున్న ఈ వీడియోపై రష్మి గౌతమ్ స్పందించింది. అసలేంటి ఇది.. ఇప్పుడు వీడు చేసిన పనికి సస్పెండ్ అవుతాడు అంతే కదా.. ఏ సమాజంలో బతుకుతున్నాం మనం.. మానవత్వం చచ్చిపోయింది అంటూ ట్వీట్ చేసింది.ఓ మహిళను ఇంత దారుణంగా కొట్టిన వీడికి ఎలాంటి శిక్ష వేయాలంటూ ప్రశ్నించింది రష్మి. దీనిపై సింగర్ స్మిత, హరీష్ శంకర్ కూడా స్పందించారు. ఇక ఈ విషయంపై వెంటనే స్పందించిన పోలీసులపై ఏపీ డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ఎస్పీ భాస్కర్ భూషణ్, నెల్లూరు పోలీసులను ప్రత్యేకంగా ప్రశంసించారు. దిశ పోలీస్ స్టేషన్‌లో అప్పగించండని.. వారంలోపు ఛార్జ్ షీట్‌ను పొందు పరచండని ఆదేశించారు.
First published: June 30, 2020, 5:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading