రాజుగారి గదిలోకి ఎంట్రీ ఇస్తున్న రష్మీ గౌతమ్.. కండిషన్స్ అప్లై...

Rashmi Gautam | ‘రాజుగారి గది’ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రష్మీ గౌతమ్‌ను కాంటాక్ట్ చేసినట్టు తెలిసింది.

news18-telugu
Updated: July 18, 2019, 7:02 PM IST
రాజుగారి గదిలోకి ఎంట్రీ ఇస్తున్న రష్మీ గౌతమ్.. కండిషన్స్ అప్లై...
రష్మీ గౌతమ్
  • Share this:
జబర్దస్త్ కామెడీ షో యాంకర్ రష్మీ గౌతమ్‌కు ఈ మధ్య సినిమా అవకాశాలు లేవు. ఓ వైపు తన తోటి యాంకర్ అనసూయ అటు సినిమాలు, ఇటు టీవీ షోలతో రెండు చేతులా సంపాదిస్తుంటే, రష్మీ గౌతమ్ మాత్రం.. కేవలం కామెడీ స్కిట్లకే పరిమితం అవుతోంది. తాజాగా రష్మీ గౌతమ్‌కు ఓ సినిమా ఆఫర్ వచ్చినట్టు టాలీవుడ్ టాక్. ‘రాజుగారి గది’ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రష్మీ గౌతమ్‌ను కాంటాక్ట్ చేసినట్టు తెలిసింది. గతంలో కూడా రష్మీ పలు హారర్ కామెడీ సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇలాంటి సినిమాలు రష్మీకి కొట్టినపిండిలాంటివి. అయితే, అందుకు ఆమె ఒప్పుకొంటుందా? లేదా అనేది చూడాలి. రాజుగారి గది సీక్వెల్‌గా మూడో పార్ట్‌‌ తమన్నాను లీడ్ రోల్లో తీసుకుని షూటింగ్ ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత తమన్నా ఆ సినిమా నుంచి తప్పుకొంది. మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.

First published: July 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు