ఎలక్షన్ కమీషన్ తీరుపై రష్మి గౌతమ్ ఫైర్.. మేం ఇంకా చావలేదుగా..

సినిమా వాళ్లు అంటే ఉంటే ఓటేస్తారు.. లేదంటే తప్పించుకుంటారు. అంతేకానీ రాజకీయాలను సీరియస్‌గా తీసుకోరు అనే అపప్రద ఉంది. కానీ ఇప్పుడు వాళ్లు కూడా చాలా బాధ్యతగా మారిపోతున్నారు. ఒక పని చేసేటప్పుడు పది మంది తమ వైపు చూస్తున్నారనే ఆలోచన కూడా వాళ్లలో కనిపిస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 11, 2019, 5:05 PM IST
ఎలక్షన్ కమీషన్ తీరుపై రష్మి గౌతమ్ ఫైర్.. మేం ఇంకా చావలేదుగా..
రష్మీ గౌతమ్ ట్విట్టర్ ఫోటో
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 11, 2019, 5:05 PM IST
సినిమా వాళ్లు అంటే ఉంటే ఓటేస్తారు.. లేదంటే తప్పించుకుంటారు. అంతేకానీ రాజకీయాలను సీరియస్‌గా తీసుకోరు అనే అపప్రద ఉంది. కానీ ఇప్పుడు వాళ్లు కూడా చాలా బాధ్యతగా మారిపోతున్నారు. ఒక పని చేసేటప్పుడు పది మంది తమ వైపు చూస్తున్నారనే ఆలోచన కూడా వాళ్లలో కనిపిస్తుంది. అందులో రష్మి గౌతమ్ లాంటి వాళ్లైతే తమతో పాటు సమాజం గురించి బాగానే ఆలోచిస్తుంటారు. కొన్ని రోజులుగా ఈమె సోషల్ మీడియాలో చాలా రచ్చ చేస్తుంది. అది కూడా తన కోసం కాదు.. సమాజం కోసమే. ఇప్పుడు కూడా ఎలక్షన్ కమీషన్ తీరుపై మండి పడింది రష్మి గౌతమ్.మేం ఇంకా చావలేదుగా.. బతికే ఉన్నాంగా.. ఎందుకు మాకు ఓటు లేదంటూ నిలదీసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ విషయంపై అమ్మడు ట్విట్టర్లో వీడియో కూడా పోస్ట్ చేసింది. దీనిపై నేషేనల్ లెవల్లో చర్చ జరుగుతుండటం విశేషం. కేవలం టీవీల్లో, సినిమాల్లో మాత్రమే కనిపించి మన పని అయిపోయిందని చేతులు దులిపేసుకునే బ్యాచ్ కాదు రష్మి గౌతమ్. ఈమె బయటి విషయాలను కూడా బాగానే పట్టించుకుంటుంది. ఇప్పుడు ఎన్నికల కమీషన్ తీరుపై ఇదే మాట్లాడింది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు తన తల్లితో బాటు విశాఖపట్నం వచ్చిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.

అసలు తమ ఇంటికి స్లిప్స్ రాకపోవడంతో ఫైర్ అయింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు.. ఓటర్ల జాబితాలో తన పేరు కనబడకపోవడంతో తీవ్ర నిరాశకు గురయింది రష్మి గౌతమ్. ఇక ఎలాగోలా తన పేరు చివర్లో ఆన్ లైన్‌లో చూసుకుంది. కానీ అక్కడ తన పేరు కనిపించకపోవడంతో మండిపడింది రష్మి. తామేమీ చనిపోలేదని.. ఇంకా బతికే ఉన్నామని.. ఎందుకు తమ పేర్లు లేవని రష్మి ఆవేశంగా ప్రశ్నించింది. ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.అక్కడితో ఆగకుండా ఎవరు చేయాల్సిన పని వాళ్లు సరిగ్గా చేస్తే ఇలాంటి తంటాలు రావు కదా అంటుంది రష్మి. తమ పరిస్థితే ఇలా ఉంటే సీనియర్ సిటిజన్ల పరిస్థితి ఎలా ఉంటుందని.. వాళ్లకు టెక్నాలజీ అంటే కూడా తెలియదని.. అలాంటి వాళ్లు ఓట్లు ఎలా వినియోగించుకుంటారని ప్రశ్నించింది ఈ భామ. అయితే చివరి నిమిషంలో రష్మికి ఓటర్ స్లిప్ రావడం విశేషం. దాంతో అక్కడ్నుంచి ఓటేసి వెళ్లిపోయింది ఈ జబర్దస్త్ యాంకర్.
First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...