హోమ్ /వార్తలు /సినిమా /

లాక్‌డౌన్ వేళ వాళ్లపై మండి పడుతున్న రష్మి గౌతమ్..

లాక్‌డౌన్ వేళ వాళ్లపై మండి పడుతున్న రష్మి గౌతమ్..

రష్మి గౌతమ్ (Image: Rashmi Gautam/Facebook)

రష్మి గౌతమ్ (Image: Rashmi Gautam/Facebook)

Rashmi Gautam: కరోనా చావుల కంటే కూడా ఆకలి చావులు చూసేలా కనిపిస్తున్నారు. అలాంటి పరిస్థితి రాకూడదంటే మన దగ్గర ఉన్నది కాస్తైనా సాయం చేయాల్సిందే అంటుంది జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్.

కరోనా వైరస్ ఎలాగైనా కట్టడి చేయాలని దేశ వ్యాప్తంగా ప్రభుత్వం కొన్ని రోజుల కింద లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలు చాలానే ఇబ్బందులు పడుతున్నారు. ధనికులతో పాటు మిడిల్ క్లాస్ వాళ్లు కూడా ఎలాగోలా ఉన్నారు కానీ రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు మన దేశంలో చాలానే ఉన్నాయి. అలాంటి నిరుపేదలు ఇప్పుడు తిండి లేక అల్లాడిపోతున్నారు. కరోనా చావుల కంటే కూడా ఆకలి చావులు చూసేలా కనిపిస్తున్నారు. అలాంటి పరిస్థితి రాకూడదంటే మన దగ్గర ఉన్నది కాస్తైనా సాయం చేయాల్సిందే అంటుంది జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్.


రోజువారి కూలీలతో పాటు బిక్షాటన చేసుకుని బతికే చాలా మందికి ఇప్పుడు పూట కూడా గడవడం లేదని.. అలాంటి వాళ్లకు సాయం చేయాలని కోరుకుంటుంది ఈమె. వాళ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఆమె గుర్తు చేసింది. కొందరు బిచ్చగాళ్లు సమస్యలు తీసుకొస్తున్నారంటూ ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌పై జబర్దస్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ మండిపడింది. ఈ విషయంపై ఆమె సమాధినమిస్తూ.. షాప్స్ అన్నీ మూసేసారు.. పేదలకు తిండి కూడా దొరకట్లేదు.. కొందరికి చెత్త ఏరుకోవడం తప్ప మరో ఆప్షన్‌ లేదు.. అలాంటి వాళ్లకు ఇప్పుడు తిండి ఎక్కడ్నుంచి వస్తుందంటూ ప్రశ్నించింది.


కాస్తైనా ఆలోచించరా.. అదే వాళ్ల జీవనాధారం.. మీరు తినేటప్పుడు ఒక్క చపాతి, కాస్త అన్నం అయినా వారికి ఇస్తే, కొంచెమైనా వాళ్ల ఆకలి తీర్చినవారు అవుతారు కదా అంటూ ఫైర్ అయింది. మనం ఇంట్లో కూర్చుని బాగానే మూడు పూటలు తింటున్నాం.. కానీ పేద వాళ్లు మాత్రం ఒక్కపూట తిండి కోసం అల్లాడిపోతున్నారు.. ప్లీజ్‌ ప్లీజ్ దయచేసి అలాంటి వాళ్లకు ఆహారం అందిద్దాం అంటూ వేడుకుంటుంది రష్మి. ఇప్పుడు కూడా అన్నీ మనమే తినేయాలి.. అన్నీ మనమే కొనుక్కుని పెట్టుకోవాలనే స్వార్థం వద్దు.. ఇలాంటి సమయంలో కూడా నేర్చుకోకపోతే.. మరెప్పుడు నేర్చుకుంటారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది రష్మి గౌతమ్.

First published:

Tags: Anchor rashmi gautam, Lockdown, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు