హోమ్ /వార్తలు /సినిమా /

ఈ జనరేషన్‌కు అది లేదు.. మళ్లీ రెచ్చిపోయిన రష్మి గౌతమ్..

ఈ జనరేషన్‌కు అది లేదు.. మళ్లీ రెచ్చిపోయిన రష్మి గౌతమ్..

రష్మీ గౌతమ్(Rashmi Gautam/Twitter)

రష్మీ గౌతమ్(Rashmi Gautam/Twitter)

Rashmi Gautam: జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్‌కు మనుషుల కంటే కూడా మూగ జీవాలపైనే ఎక్కువగా ప్రేమ ఉంది. వాటిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత వేలాది మూగ జీవాల..

జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్‌కు మనుషుల కంటే కూడా మూగ జీవాలపైనే ఎక్కువగా ప్రేమ ఉంది. వాటిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత వేలాది మూగ జీవాల ఆలన పాలన చూసుకుంటుంది రష్మి. వాటి ఆకలి తీరుస్తుంది.. తన జంతు ప్రేమతో అందరి ప్రశంసలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే అప్పుడప్పుడూ ఈమెకు కోపం తెప్పించే పనులు కూడా కొందరు చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు కుక్కలపై చేస్తున్న అరాచకాల వీడియోలు రష్మి గౌతమ్‌కు ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. వాటిని చూపించి దీనికి ఏం సమాధానం చెప్తారు అంటూ అడుగుతున్నారు.


తాజాగా ఓ అమ్మాయి అసలు మనిషిగా బతకాలంటేనే సిగ్గు అనిపిస్తుంది అంటూ కుక్కలపై పాకిస్తాన్‌లో చేస్తున్న పాశవిక దాడిని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కుక్కను దారుణంగా హింసిస్తున్నారు అక్కడ. దాంతో ఇది చూసి మనుషిగా బతకడానికి సిగ్గేస్తుందంటూ పోస్ట్ చేసింది. ఈ ట్వీట్‌కు తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది రష్మి గౌతమ్. అసలు మనుషులకు విలువలు అనేది ఇంటి నుంచే మొదలవ్వాలి.. అక్కడే తొలి పాఠాలు నేర్పించాలి.. ఎలా బతకాలి.. ఎలా ఉండాలి అనేది అన్నీ ఇంటి నుంచే మొదలవ్వాలి.


కనీసం ఓ రాయి తీసుకుని కొట్టాలనే ఆలోచన కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబానిదే. కానీ ఇప్పటి తరం అది మరిచిపోతుంది.. అలాంటి విలువలను గాలికి వదిలేసింది.. అందుకే ఇలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది. మూగ జీవాలను ప్రేమించలేకపోవడం నిజంగానే ఓ రోగం అంటుంది రష్మి గౌతమ్. ఈమె పోస్టుకు కొందరు సపోర్ట్ చేస్తున్నారు.. మరికొందరు మాత్రం కరుస్తున్నపుడు ఇలాంటివి తప్పవంటూ పోస్టులు పెడుతున్నారు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anchor rashmi gautam, Jabardasth comedy show, Telugu Cinema

ఉత్తమ కథలు