కియారా అద్వానీ బాటలో జబర్దస్త్ రష్మీ గౌతమ్.. ఇదైనా వర్కౌట్ అవుతుందా...

కియారా అద్వానీ, రష్మీ గౌతమ్ (ఫైల్ ఫోటోస్)

జబర్దస్త్ షో తో పాపులర్ అయిన రష్మీ గౌతమ్ ఇపుడు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని ఫాలో కాబోతుందా. అంటే ఔననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. 

 • Share this:
  జబర్దస్త్ షో తో పాపులర్ అయిన రష్మీ గౌతమ్ ఇపుడు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని ఫాలో కాబోతుందా. అంటే ఔననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కాలంలో పలువురు తారలు సినిమాల కంటే వెబ్‌సిరీస్‌లలో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సెన్సార్‌ సమస్యలు లేకపోవడంతో.. కథను ఎలాగైతే చూపించాలనుకుంటారో..యదాతథంగా అదే తెరకెక్కించేందుకు ఆస్కారమున్న నేపథ్యంలో పలువురు బాలీవుడ్ నటీమణులు ఈ వెబ్ సిరీస్ ల పైనే ఆధారపడుతూ తమలోని టాలెంట్ ని చూపించి స్టార్ హీరోయిన్స్ గా చెలామణి అవుతున్నారు. ప్రస్తుతం "కబీర్ సింగ్" సినిమాతో బాలీవుడ్ లో పాపులర్ అయిపోయిన కియారా అద్వానీ ఇటివల తన ఇంటర్వ్యూ లో 'లస్ట్‌ స్టోరీస్‌' వెబ్ సిరీస్ చేయకపోయుంటే తన సినిమా కెరీర్‌లో చాలా అవకాశాలు కోల్పోయేదాన్ని అని పేర్కోంది. ఈ సందర్భంలో కియారా మాట్లాడుతూ.. తాను కెరీర్ ఆరంభంలో చాల కష్టాలు పడ్డానని, 'ధోనీ' సినిమా త‌ర్వాత కూడా చాలా ఆడిష‌న్‌లలో పాల్గొన్నానని.. ఈ నేపథ్యంలో చాలా ఆఫీసుల చుట్టూ అవకాశాలకోసం తిరిగానని చెప్పింది. 'లస్ట్‌ స్టోరీస్‌' చేయ‌క‌పోతే చాలా న‌ష్ట‌పోయేదాన్ని అంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఈ వెబ్ సిరీస్ లో శృంగార కోరిక‌లు ఎక్కువ‌గా గ‌ల గృహిణిగా నటించింది కియారా అద్వానీ.

  jabardasth anchor rashmi gautam doing web series in the way of kiara advani lust stories,kiara advani,rashmi gautam,kiara advani rashmi gautam,kiara advani twitter,kiara advani instagram,kiara advani facebook,rashmi gautam jabardasth comedy show,extra jabradasth,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautam facebook,rashmi gautam shivaranjani,kiara advani lust stoies web series,kiara advani kabir singh,bollywood,tollywood,రష్మీ గౌతమ్,కియారా అద్వానీ,రష్మీ గౌతమ్ ట్విట్టర్,కియారా అద్వానీ లస్ట్ స్టోరీస్,కియారా అద్వానీ కబీర్ సింగ్,రష్మీ గౌతమ్ జబర్దస్త్ కామెడీ షో.రష్మీ గౌతమ్ వెబ్ సిరీస్,
  లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లో కియారా అద్వాని, నేహా దూపియా Photo : Youtube


  ఐతే  కియారా వెళ్లిన బాటలోనే రష్మీ గౌతమ్  పయనించాలనుకుంటోందట . బుల్లితెరపై పలు టీవీ షోస్ ద్వారా హంగామా చేస్తున్న ఈ భామ . గుంటూరు టాకీస్, బలపం పట్టి భామ ఒడిలో, నెక్స్ట్ నువ్వే లాంటి సినిమాలతో వెండితెరపై అదృష్టం పరీక్షించుకుంది తాజాగా విడుదలైన 'శివరంజని' కూడా ప్లాప్ బాట పట్టడంతో ఈ భామ.. ఇక డిజిటల్ రంగంలోనూ లక్ పరీక్షించుకోనుంది అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఈ భామ కొన్ని వెబ్ సిరీస్‌లు చేసినా.. ఆమె టార్గెట్ మాత్రం సినిమాలపైనే ఉండే. తాజాగా రష్మీ గౌతమ్ నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్స్‌గా నిలుస్తుండంతో ఆమె తిరిగి వెబ్ సిరీస్‌పైనే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక రష్మీ గౌతమ్ చేయబోయే వెబ్ సిరీస్ విషయానికొస్తే.. ‘ఏ ఫిలిం బై అరవింద్' దర్శకుడు శేఖర్ సూరి ఈ వెబ్ సిరీస్ తెరెక్కించనున్నారు. ఇక శేఖర్ సూరి చెప్పిన స్టోరీ లైన్  కూడా కంటెంట్ అమితంగా నచ్చడంతో రష్మీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అతి త్వరలో ఈ వెబ్ సిరీస్ ఇంటర్నెట్ వేదికపై అలరించనుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్‌కి సంబందించిన మరో విశేషమేమిటంటే.. సీనియర్ నటుడు శ్రీకాంత్, సత్యదేవ్ కూడా ఈ వెబ్ సిరీస్‌లో భాగం కానున్నారని టాక్.

   
  First published: