లైవ్‌లో బోరున ఏడ్చేసిన జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్..

రష్మీ గౌతమ్

Jabardasth anchor rashmi gautam : జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ లైవ్‌లోనే బోరున ఏడ్చేసింది. సామాజిక అంశాలపై స్పందించడంలో ముందుండే ఈ బ్యూటీ.. లాక్ డౌన్ ప్రభావంతో పేద ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రస్తావించింది.

  • Share this:
    Jabardasth anchor rashmi gautam : జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ లైవ్‌లోనే బోరున ఏడ్చేసింది. సామాజిక అంశాలపై స్పందించడంలో ముందుండే ఈ బ్యూటీ.. లాక్ డౌన్ ప్రభావంతో పేద ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రస్తావించింది. ఈ సందర్భంగా ‘ఆమె కంట కన్నీళ్లు ఆగలేదు. రోజు వారి కూలీలు, పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది సమయానికి తిండి కూడా తినడం లేదు. వీధుల్లో కుక్కలు, ఆవులు కూడా ఆహారం దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేసింది. అభిమానులు, ప్రేక్షకులు తోచినంతంగా వాటికి ఆహారం అందించాలని రష్మీ కోరింది. మరీ ముఖ్యంగా పేదలకు అందరూ విరాళాలు ఇవ్వాలని విన్నవించింది. ఒక్క రూపాయి ఇచ్చినా అది ఎంతో మందికి ఉపయోగపడుతుందని చెప్పింది. మన ఇంటి పరిసరాల్లో ఉండే పేదలకు కూడా సహాయం అందించాలని పిలుపునిచ్చింది.

    కాగా, రష్మి తన వంతుగా 25 వేల రుపాయలను పీఎం కేర్స్‌కు విరాళంగా ఇచ్చింది. దానికి సంబందించి ఓ ట్వీట్ చేసింది. ఈ ఆపత్కాలంలో ప్రధాన మంత్రి సహాయనిధికి తన వంతుగా విరాళం ఇచ్చానని తెలిపింది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: