మిమీ చక్రవర్తి, నుస్రత్ జహాన్‌ల డ్రెస్సింగ్‌పై జబర్దస్త్ రష్మీ హాట్ కామెంట్స్

మిమీ చక్రవర్తి, నుస్రత్ జహాన్‌, రష్మీ గౌతమ్ Photo: Twitter

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా తన ట్విటర్‌లో సినిమాలకు సంబందించిన వార్తల కన్నా సమాజం గురించి, ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. అందులో భాగంగా ఇటీవల పశ్చిమ బెంగాల్ నుండి పార్లమెంట్‌కు ఎన్నికైన మహిళ ఎంపీలు మిమీ చక్రవర్తి, నుస్రత్ జహాన్‌ల డ్రెస్సింగ్‌పై స్పందించింది.

  • Share this:
    జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా తన ట్విటర్‌లో సినిమాలకు సంబందించిన వార్తల కన్నా సమాజం గురించి, చుట్టూ జరుగుతున్న ప్రస్తుత విషయాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. అయితే వాటిల్లో కూడా ఆమె ముఖ్యంగా మహిళ సాధికారత మొదలగు విషయాల పట్ల ఎక్కువగా స్పందిస్తూ తన ట్వీటర్ హ్యాండిల్‌‌ను వేదికగా చేసుకొని రాస్తూ ఉంటుంది రష్మీ. అందులో భాగంగా.. ఆమె గతంలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు, రేప్‌లు గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. రేప్‌లు అమ్మాయిల్నీ, వారి జీవితంలో ఎలా కుంగదీస్తాయో తెలుపుతూ గతంలో ఓ ట్వీట్ కూడా చేసింది. అమ్మాయిలపై రేప్‌లకు కారణం వారు వేసుకుంటున్న మినీ స్కట్స్ అంటూ కొందరు చేస్తున్న విమర్శలపై రష్మీ సీరియస్ అవుతూ.. రేప్ అనే పదం ప్యాన్సీ వర్డ్ కాదు.. దాన్ని జోక్‌గా వాడడం ఎంటని ప్రశ్నించింది.    తాజాగా మరోసారి తన సోషల్ మీడియా వేదికగా రష్మీ స్పందిస్తూ..పశ్చిమ బెంగాల్ నుండి పార్లమెంట్‌కు ఎన్నికైన మహిళ ఎంపీలు మిమీ చక్రవర్తి, నుస్రత్ జహాన్‌ల డ్రెస్సింగ్‌పై స్పందించింది. అంతేకాదు తన మద్దతును కూడా తెలిపింది. వివరాల్లోకి వెళ్తే..పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ ఇద్దరు ఎంపీలు పార్లమెంట్‌కు మోడ్రన్ డ్రెస్‌లు ధరించి వెళ్లారు. దీంతో కొందరు నెటిజన్స్ వీరు ధరించిన దుస్తులపై కామెంట్స్ పెడుతూ..చీరలు ధరించి వెళ్లకుండా..ఇలా ప్యాంట్, షర్ట్ ధరించి ఎలా పార్లమెంట్‌కు వెళతారని విరుచుపడ్డారు. వీరి డ్రెస్‌పై తీవ్రంగానే సోషల్ మీడియాలో చర్చ జరిగింది.  దీనిపై స్పందించిన యాంకర్ రష్మీ వారికి తన మద్దతూ తెలుపుతూ మీరు ప్రజలచేత ఎన్నుకోబడ్డరు. ఎవరేమన్న పట్టించుకోకుండా .. మీరు చేయాల్సింది చేయండి అంటూ తన సపోర్ట్‌ను తెలిపింది.

    First published: