హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Rashmi: సుడిగాలి సుధీర్‌తో పెళ్లి.. కుండబద్ధలు కొట్టిన యాంకర్ రష్మీ

Anchor Rashmi: సుడిగాలి సుధీర్‌తో పెళ్లి.. కుండబద్ధలు కొట్టిన యాంకర్ రష్మీ

Anchor Rashmi: సుడిగాలి సుధీర్, రష్మీ పెళ్లి చేసుకోవాలని కోరుకునే ఆడియెన్స్ సంఖ్య ఎక్కువగానే ఉంది. దీనిపై తన మనసులోని మాటను బయటపెట్టింది రష్మీ.

  సుడిగాలి సుధీర్‌, రష్మీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే దానిపై ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అయితే దీనిపై ఈ ఇద్దరూ మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. అయితే కొద్దిరోజుల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై రష్మీ పరోక్షంగా కుండబద్ధలు కొట్టింది. సుధీర్, రష్మీ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారనే ప్రశ్నకు స్పందించిన ఈ యాంకర్ రష్మీ... చాలామంది చాలా అనుకుంటారని... కానీ అన్ని జరగవని తేల్చి చెప్పింది. అసలు తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలిపింది. తన దృష్టి అంతా కేవలం కెరీర్ మీదే ఉందంటూ.. పరోక్షంగా సుధీర్‌తో పెళ్లి లేదని క్లారిటీ ఇచ్చింది.

  అంతేకాదు.. తాను సుధీర్‌తో ప్రతి షో చేయాలని చాలామంది కోరుకుంటున్నారని.. కానీ అది సాధ్యపడదని తెలిపింది. ఈ విషయాన్ని అంతా అర్థం చేసుకోవాలని సూచించింది. తాము ఇద్దరు షోలు చేసేది కేవలం జనాలను ఎంటర్ టైన్ చేయడానికి మాత్రమే అని వెల్లడించింది. ఈ రకంగా పరోక్షంగా తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని తేల్చిచెప్పింది. ఇక సుధీర్‌తో కలిసి సినిమా చేసే విషయంపై కూడా రష్మీ క్లారిటీ ఇచ్చింది. ఇద్దరం కలిసి సినిమా చేయాలనే ఆలోచన ఇద్దరికీ ఉందని.. దీనిపై ఇద్దరం కథల కోసం ఎదురుచూస్తున్నామని వివరించింది.

  మంచి కథ వస్తే... తామిద్దరం కలిసి నటిస్తామని వెల్లడించింది. రష్మీ మాటలకు బట్టి సుధీర్, రష్మీ పెళ్లి గురించి వస్తున్న హైప్ అంతా కేవలం ఆన్ స్క్రీన్‌కు మాత్రమే పరిమితమనే విషయం మరోసారి తేలిపోయింది. అయితే తామిద్దరికీ కలిపి ఉన్న క్రేజ్‌ను సినిమా చేయడం ద్వారా క్యాష్ చేసుకుని ఆడియెన్స్‌ను ఎంటర్ టైన్ చేయాలనే ఆలోచన మాత్రం ఈ ఇద్దరికీ ఉందనే విషయంలో మాత్రం ఓ క్లారిటీ వచ్చింది. రష్మీతో సినిమా చేయడం కోసం మంచి కథ కోసం ఎదురుచూస్తున్నానని సుధీర్ కూడా కొద్దిరోజుల క్రితం కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

  First published:

  Tags: Anchor rashmi gautam, Jabardasth, Sudigali sudheer

  ఉత్తమ కథలు