రష్మి గౌతమ్ బర్త్ డే స్పెషల్.. ఎన్ని కష్టాలు పడిందో తెలుసా..?

#HBDRashmiGautam: రష్మి గౌతమ్.. ఎప్రిల్ 27న ఈమె పుట్టిన రోజు.  ఒకప్పుడు తన పేరు ఎవరికైనా తెలిస్తే బాగున్ను అనుకుంది ఈమె. కానీ ఇప్పుడు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 27, 2020, 5:05 PM IST
రష్మి గౌతమ్ బర్త్ డే స్పెషల్.. ఎన్ని కష్టాలు పడిందో తెలుసా..?
రష్మి గౌతమ్ పుట్టిన రోజు (HBD Rashmi Gautam)
  • Share this:
రష్మి గౌతమ్.. ఎప్రిల్ 27న ఈమె పుట్టిన రోజు.  ఒకప్పుడు తన పేరు ఎవరికైనా తెలిస్తే బాగున్ను అనుకుంది ఈమె. కానీ ఇప్పుడు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో..? సినిమాల్లో కూడా ఈ భామ పేరును వాడేస్తున్నారు. అంతగా క్రేజ్ తెచ్చుకుంది ఈమె. బర్త్ డే రోజు అంతా సాధించింది చెప్పుకంటారు. కానీ సాధించడానికి రష్మి ఎన్ని కష్టాలు పడిందో తెలుసా..? ఒక్క అవకాశం అంటూ చెప్పులరిగేలా తిరిగింది ఈ జబర్దస్త్ బ్యూటీ. సినిమాల్లో ఏ ఆఫర్ వచ్చినా కూడా కాదనకుండా చేస్తానని ఆఫర్స్ ఇచ్చింది. సీనియర్ దర్శకుల సినిమాల్లో నటించిన తర్వాత కూడా రష్మిని తెలుగు దర్శక నిర్మాతలు పట్టించుకోలేదు.

జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ (Rashmi Gautam hot)r rashmi gautam prayers for boy surjith who fell in borewell at tamilandu,rashmi gautam, rashmi gautam tweets, rashmi on surjith, rashmi on chile who fell in bore well, jabardasth rashmi, jabardasth anchor, jbardasth comedy show, rashmi latest news, rashmi latest tweet, జబర్దస్త్ రష్మీ, రష్మీ లేటెస్ట్ న్యూస్, రష్మీ గౌతమ్, రష్మీ ట్వీట్, జబర్దస్త్ కామెడీ షో, జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో, జబర్దస్త్ యాంకర్, జబర్దస్త్ రష్మీ, రష్మీ సుడిగాలి సుధీర్, రష్మీ ప్రార్థనలు, బోరుబావిలో చిన్నారి కోసం రష్మీ ప్రార్థనలు, బోరుబావిలో పడ్డ సుర్జిత్, తమిళనాడు
జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ (Rashmi Gautam hot)


10 ఏళ్ల పాటు నరకం చూసింది. ఏ ఆఫీస్ పడితే ఆ ఆఫీస్‌కు వెళ్లి ఫోటోలు ఇవ్వడమే కాకుండా ఆడిషన్స్ కూడా చేసింది. హోలీ, కరెంట్ లాంటి సినిమాల్లో నటించినా రష్మికి పెద్దగా గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో ఆమెకు అనుకోకుండా జబర్దస్త్ కామెడీ షోలో హోస్టింగ్ చేసే అవకాశం వచ్చింది. అనసూయ గర్భం దాల్చడంతో కొన్ని వారాల పాటు ఆమె తప్పుకోవడంతో రష్మి గౌతమ్‌కు కలిసొచ్చింది. దాంతో అలా ఆమెకు జబర్దస్త్ ఆఫర్ వచ్చింది. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు తెలియని రష్మి గౌతమ్ జబర్దస్త్ కామెడీ షోలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరికీ పరిచయం అయిపోయింది.

రష్మి గౌతమ్ (Image: Rashmi Gautam/Facebook)
రష్మి గౌతమ్ (Image: Rashmi Gautam/Facebook)


ఆ రోజు మొదలైన రష్మి దండయాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జబర్దస్త్ షోలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని హాట్ షోతో మతులు చెడగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అనసూయ రీ ఎంట్రీ ఇచ్చినా కూడా అప్పటికే పాతుకుపోయింది. సుడిగాలి సుధీర్‌తో ఈమె కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. తెలుగులో నటించిన తర్వాత అప్పట్లో ఓ తమిళ సినిమాలో కూడా నటించింది రష్మి. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. అయినా కూడా ఆమెకు అక్కడ గుర్తింపు రాలేదు.

జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ (Rashmi Gautam hot)
జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ (Rashmi Gautam hot)


వరసగా హీరోయిన్ స్నేహితురాలి పాత్రల్లో నటించిన రష్మి గౌతమ్.. జబర్దస్త్ తర్వాత హీరోయిన్‌గా ప్రమోషన్ అందుకుంది. అప్పట్నుంచి డబ్బులకే తన ప్రాముఖ్యత అని చెప్పింది రష్మి. తనకు హీరోయిన్ అవకాశాలు వచ్చినపుడు నటించడంలో తప్పేం లేదు.. డబ్బులు వస్తున్నపుడు గ్లామర్ షో చేయడంలో తప్పేం లేదని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ గ్లామర్ షోలో రష్మిని మించిన వాళ్లు లేరేమో అనేంతగా రచ్చ చేస్తుంది ఈ బ్యూటీ. మొత్తానికి ఒకప్పుడు ఒక్క ఛాన్స్ అని అడిగిన రష్మి.. ఇప్పుడు స్టార్ అయిపోయింది.
First published: April 27, 2020, 5:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading