యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు ఎక్స్ట్రా జబర్ధస్త్ యాంకర్ రష్మి గౌతమ్ గట్టి షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.రష్మి గౌతమ్, అనసూయ భరద్వాజ్.. తెలుగు టీవీ ప్రేక్షకులకు వీళ్లిద్దరి పరిచయం పెద్దగా అవసరం లేదు. తెలుగు టీవీ తెరపై సంచలనాలు సృష్టిస్తున్నారు వీరిద్దరూ. ఒకే కార్యక్రమంతో ఇద్దరూ స్టార్స్ అయ్యారు కూడా. అప్పటి వరకు ఎలా ఉన్నా జబర్దస్త్ అనే ఒకే ఒక్క షోతో స్టార్ యాంకర్స్ అయిపోయారు ఈ ముద్దుగుమ్మలు. ఇదే క్రేజ్ ఇప్పుడు సినిమాల్లో కూడా పనికొస్తుంది. జబర్దస్త్ పేరు చెప్పుకుని వరసగా సినిమాలు చేసేస్తున్నారు ఈ యాంకర్స్. ఐతే.. ఉప్పు లేని పప్పు.. మసాలా లేని కూరలా ఇన్ని రోజులు వీళ్లు జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు దూరంగా ఉన్నారు. ఐతే.. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో జబర్ధస్త్ ప్రోగ్రామ్ మళ్లీ పున: ప్రారంభం అయింది. ఐతే.. తాజాగా విడుదల చేసిన రేటింగ్స్ విషయంలో అనసూయ హోస్ట్ చేసే జబర్ధస్త్ ప్రోగ్రామ్.. రష్మి గౌతమ్ హోస్ట్ చేసే ఎక్స్ట్రా జబర్ధస్త్‌కు ఎక్కువ టీర్పీలు వచ్చాయి. గత రెండు వారాలుగా అనసూయ ప్రోగ్రామ్ కంటే రష్మి గౌతమ్ హోస్ట్ చేసే ప్రోగ్రామ్‌కే ఎక్కువ టీర్పీలు రావడం విశేషం. ఈ రకంగా చేసే ప్రోగ్రామ్స్ ఒకటే ఐనా.. రేటింగ్స్ విషయంలో మాత్రం రష్మిగౌతమ్ ఎక్స్ట్రా జబర్ధస్త్ ప్రోగ్రామ్ చూడటానికే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారనే విషయం స్పష్టం అయింది. మరి రష్మి గౌతమ్ ఎక్స్ట్రా జబర్ధస్త్ అదే దూకుడును ముందు ముందు కూడా మెయింటేన్ చేస్తుందా లేదా అనేది చూడాలి. మరోవైపు జబర్థస్త్‌లో రేటింగ్లేని ప్రోగ్రామ్స్‌కు యూట్యూబ్‌లో మాత్రం లక్షల్లో వ్యూస్ రావడం గమనార్హం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.