జబర్దస్త్ యాంకర్ రష్మీ ఇంట పెళ్లి సందడి

తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా లంగా-ఓణీ ధరించి సోదరుడి పెళ్లికి మరింత కళ తెచ్చింది. ఆటపాటలతో అలరిస్తూ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసింది ఈ జబర్దస్త్ బ్యూటీ.

news18-telugu
Updated: December 2, 2019, 8:58 PM IST
జబర్దస్త్ యాంకర్ రష్మీ ఇంట పెళ్లి సందడి
రష్మీ గౌతమ్
  • Share this:
జబర్దస్త్ బ్యూటీ, యాంకర్ రష్మీ గౌతమ్ విశాఖలో సందడి చేసింది. తరచూ సినిమా ఫంక్షన్లు, ప్రైవేట్ కార్యక్రమాల్లో కనిపించే రష్మీ గౌతమ్.. ఫ్యామిలీతో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. ఐతే ఆదివారం సోదరుడి వివాహంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రష్మీ గౌతమ్. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా లంగా-ఓణీ ధరించి సోదరుడి పెళ్లికి మరింత కళ తెచ్చింది. ఆటపాటలతో అలరిస్తూ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసింది ఈ జబర్దస్త్ బ్యూటీ.

రష్మీ గౌతమ్


విశాఖపట్టణంలోని పాత గాజువాకలో మేజర్ మలేయ్ త్రిపాఠి-తానియా వివాహం ఘనంగా జరిగింది. ఉత్సవ్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుకకు యాంకర్ రష్మీ హాజరైంది. రష్మీకి మేలేయ్ త్రిపాఠి వరుసకు సోదరుడు (కజిన్) అవుతాడు. ఈ వేడుకలో బీజేపీ నేత, తెలంగాణ రాష్ట్ర బేటీ బచావో బేటీ పడావో కన్వీనర్ గీతామూర్తి దంపతులు కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

సోదరుడి పెళ్లిలో రష్మీ గౌతమ్
 

ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

PICS: సోదరుడి పెళ్లిలో యాంకర్ రష్మీ సందడి
First published: December 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...