హోమ్ /వార్తలు /సినిమా /

రష్మి సాయం.. మీరూ మీ వంతు చేయండి అంటూ పిలుపు..

రష్మి సాయం.. మీరూ మీ వంతు చేయండి అంటూ పిలుపు..

రష్మి గౌతమ్ Instagram/rashmigautam

రష్మి గౌతమ్ Instagram/rashmigautam

రష్మీ గౌతమ్.. తెలుగు టీవీ తెరపై తన అందచందాలతో పాటు చురుకైన వ్యాఖ్యానంతో అదరగొడుతూ  వీక్షకుల్నీ కట్టిపడేస్తోన్న అందాల యాంకర్.

రష్మీ గౌతమ్.. తెలుగు టీవీ తెరపై తన అందచందాలతో పాటు చురుకైన వ్యాఖ్యానంతో అదరగొడుతూ  వీక్షకుల్నీ కట్టిపడేస్తోన్న అందాల యాంకర్. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాలు చేస్తూ తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు ఆ మధ్య రష్మీ హీరోయిన్‌గా నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరు తన అందచందాలతోనే హిట్ అయ్యిందని అంటారు ఆమె అభిమానులు. అది అలా ఉంటే రష్మీ మరో కోణం.. సామాజిక అంశాలపై స్పందించడం. ఇది అందరిలో చూడలేం. అది అలా ఉంటే ప్రస్తుతం కరోనా ప్రపంచ దేశాల్నీ చిగురుటాకులా వణికిస్తోంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన ప్రయత్నాలన్ని చేస్తూ కరోనాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా వచ్చేనెల 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాడనికి రకరకాల ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. అయితే ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి గానీ, రాష్ట్ర పరిస్థితి గానీ పెద్ద గొప్పగా ఏమీ లేవు. దీంతో కొంత మంది సామాజిక సృహ ఉన్న వ్యక్తులు ముందుకొచ్చి తమకు తోచిన సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి అందాల యాంకర్ రష్మీ గౌతమ్ కూడా చేరింది. రష్మి తన వంతుగా 25 వేల రుపాయలను PMcares కు విరాళంగా ఇచ్చింది. దానికి సంబందించి ఓ ట్వీట్ చేసింది. ఈ ఆపత్కాలంలో ప్రధాన మంత్రి సహాయనిధికి తన వంతుగా విరాళం ఇచ్చానని తెలిపింది. అంతేకాదు మీవంతుగా కూడా అంతో ఇంతో సాయం చేయాలనీ కోరింది.

First published:

Tags: Anchor rashmi gautam

ఉత్తమ కథలు