తన బలమేంటో చెప్పిన జబర్దస్త్ యాంకర్ అనసూయ..

జబర్దస్త్ షోను తన యాంకరింగ్‌తో మెప్పించిన అనసూయ.. ఆ తర్వాత సినిమాల్లో కూడా తన లక్‌ను పరీక్షించుకంది. సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమిత కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో మెప్పించడం విశేషం. తాజాగా ఈ భామ పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరవల్ అవుతోంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 20, 2019, 2:45 PM IST
తన బలమేంటో చెప్పిన జబర్దస్త్ యాంకర్ అనసూయ..
యాంకర్ అనసూయ Photo: Instagram
  • Share this:
జబర్దస్త్ షోను తన యాంకరింగ్‌తో మెప్పించిన అనసూయ.. ఆ తర్వాత సినిమాల్లో కూడా తన లక్‌ను పరీక్షించుకంది. సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమిత కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో మెప్పించడం విశేషం. ముఖ్యంగా ‘క్షణం’,‘రంగస్థలం’ సినిమాలు నటిగా అనసూయకు మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా ఈ భామ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ సినిమాలో ముఖ్యపాత్ర చేస్తోంది. అంతేకాదు ఇపుడీ భామ లీడ్ రోల్లో ‘కథనం’ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఒకవైపు టీవీ షోస్.. మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ అపుడపుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హాబి. ఎపుడు గ్లామర్ ఫోటోలను కాకుండా ఈ సారి వెరైటీగా స్మైలింగ్ ఫేస్‌తో ఉన్న ఫోటోను షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఏమైనా అనసూయ చేస్తోన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.ఇలాంటి స్మైలింగ్ ఫోటోలను షేర్ చేయడమే తన బలమంటూ అనసూయ చెప్పడం కొసమెరుపు.
View this post on Instagram

She believed she could so she did.

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


Published by: Kiran Kumar Thanjavur
First published: May 20, 2019, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading