బుల్లితెర యాంకర్లలో అనుసూయకు ఉన్న క్రేజీయే వేరు. మాటలే కాదు.. అందంతో అందర్ని ఆకట్టుకునే ఈ యాంకరమ్మా కేవలం అందంలోనే ఆమె పారితోషకం కూడా చాలా కాస్టలీ. యాంకర్‌గా,క్యారక్టర్ ఆర్టీస్ట్‌గా చాలా బిజీగా మారిపోయింది. వరుస షోలతో తీరకలేకుండా ఉంటుంది. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అభిమానులను మెప్పించింది. దీంతో ఆమెకు సినిమా నటించడానికి వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె వచ్చిన పాత్రలను చేయకుండా చాలా సెలక్టడ్గా వెళుతుంది. వాటితో పాటు
అప్పుడప్పుడు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ చేస్తూ హైదరాబాద్ నుండి ఇతర ఊర్లు కూడా తిరిగెస్తోంది. ఇలాంటి హాట్ బామకు అటు స్మాల్ స్క్రిన్స్ పైనా ఇటు బిగ్స్ర్కిన్ పైన మంచిది డిమాండ్ ఉంది. అలాగే సంపాదన కూడా మాములుగా ఉండదు. ఇతర యాంకర్ల కన్నా రెమ్యూనిరేషన్‌లో పొందడంలో ఫుల్ పిక్‌లో ఉంది.
తాజాగా ఆమె రెమ్యూనిరేషన్ సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. ఈవెంట్‌కి ఎంత వసూలు చేస్తుందో తెలిసిపోయింది. ఆమెకు షోకు 3 లక్షలు ఇస్తారంటా. ఇతర చిన్న చితక ఈవెంట్స్‌కు లక్ష రూపాయిలకు వరకు వసూలు చేస్తోంది. ఆమె నెలకు పెద్ద షోలు 10 వరకు చెస్తుండగా.. రిబ్బన్ కటింగ్స్,గెస్ట్ రోల్స్ వంటివి మరో పది వరకు చెస్తోంది. వీటింన్నటిని కలిపితే నెలకు 50 లక్షల వరకు సంపాదిస్తుందంటా.. ఇక సినిమాకైతే అయితే దాదాపు కోటి రూపాయిలకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందంటా.. ఇలా ఏడాదికి రెండు సినిమాలు అనుకున్నప్పటికి దాదాపు 2 కోట్ల వరకు సంపాదిస్తోంది. దీంతో ఆమె ఏడాదికి 6 కోట్ల వరకు సంపాదిస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
ప్రస్తుతం అనసూయ ఈటీవీ జబర్దస్త్‌తో పాటు మా టీవీలో ఓ షో.. జీ తెలుగులో మరో షో చేస్తోంది .. త్వరలో జెమినీలో మరో కొత్త షోతో ముందుకు రానుంది. వాటితో దాదాపు 3 సినిమాలు అమె చేతిలో ఉన్నాయి.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.