ఐలవ్‌యూ మ్యాన్..టైం లేదు చూడాల్సిందీ చాలా ఉంది.. జబర్దస్త్ భామ అనసూయ

యాంకర్ అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అనసూయ ఈరోజు తన పెళ్లిరోజును జరుపుకుంటుంది.

news18-telugu
Updated: June 4, 2019, 4:56 PM IST
ఐలవ్‌యూ మ్యాన్..టైం లేదు చూడాల్సిందీ చాలా ఉంది.. జబర్దస్త్ భామ అనసూయ
యాంకర్ అనసూయ Photo: Instagram
news18-telugu
Updated: June 4, 2019, 4:56 PM IST
యాంకర్ అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే కాకుండా అనసూయ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ సినిమాల్లో కూడా దూసుకుపోతోంది. తాజాగా ఈ భామ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబీనేషన్‌లో వస్తున్న ఆ సినిమాలో ముఖ్యపాత్ర చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దానికి తోడు ఇపుడీ భామ లీడ్ రోల్‌ చేస్తోన్న ‘కథనం’ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఒకవైపు టీవీ షోస్.. మరోవైపు సినిమాలతో బిజీగా గడుపుతోంది. 
Loading...

View this post on Instagram
 

Twinning with my best.. on the best day.. I love you my man.. don’t want to say much here.. we are running out of time to explore this day at where we are 🤪👻 #Happy9thToUs Chalo chaloooo👫@susank.bharadwaj 😘❤️💑


A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on

అది అలా ఉంటే..అనసూయ ఈరోజు తన పెళ్లిరోజును జరుపుకుంటోంది. దీంతో తన భర్తతో దిగిన ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె తన పోస్ట్‌లో రాస్తూ 'ఐలవ్‌యూ మై మ్యాన్ అంటూ.. ఇదీ తన తొమ్మిదవ పెళ్లిరోజని..ఈ రోజును ఏమాత్రం వృధా చేయకుండా మనం ఇంకా ఎక్స్ ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది..ఛలో ఛలో అంటూ తన భర్తను ఉద్దేశించి రాసింది.
First published: June 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...