రోజాకు జబర్దస్త్ బర్త్‌డే విషెస్ చెప్పిన అనసూయ

తన పుట్టినరోజు సందర్భంగా నగరి నియోజకవర్గంలో ఆమె పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించారు రోజా.

news18-telugu
Updated: November 17, 2019, 3:24 PM IST
రోజాకు జబర్దస్త్ బర్త్‌డే విషెస్ చెప్పిన అనసూయ
అనసూయ, రోజా
  • Share this:
వైసీపీ ఎమ్మెల్యే రోజా తన పుట్టినరోజు వేడుకల్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అభిమానుల నుంచి వేల సంఖ్యలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. జబర్దస్త్ షొ కూడా ఆమె జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా తన శుభాకాంక్షలు తెలిపింది. రోజాతో దిగిన ఫోటోను తన ఇనస్టా పేజీలో షేర్ చేసింది. డైనమిక్ అయిన మా రోజా గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ మెసేజ్ పెట్టింది.

మరోవైపు తన బర్త్‌డే సందర్భంగా పలు కార్యక్రమాలు ప్రారంభించారు రోజా. నగరి నియోజకవర్గంలో ఆమె పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. రోజా ఛారిటబుల్ ట్రస్ట్ తరపున పుత్తూరు పట్టణం 13వ వార్డులో వైయస్సార్ స్వఛ్చనీరు..రూ. 2కే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించే RO మినరల్ వాటర్ ప్యూరిఫైయర్ ను ఆమె ప్రారంభించారు. దీంతో పాటు... ప్లాస్టిక్ రహిత నగరిని తయారు చేయాలనీ సంకల్పంతో.. జనపనార, గుడ్డతో తయారు చేసిన సంచులను అందించారు. డిసెంబర్ 21 నాటికి నగరి నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ నుంచి కాపాడాలని ఆమె కోరారు.



First published: November 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు