వామ్మో.. అనసూయ ఆ పని కూడా కానిచ్చేస్తోంది..

అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ షోలో కంటెస్టెంట్స్ చేసే కామెడీ కంటే అనసూయ కోసమే చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.యాంకర్‌గా, నటిగా రాణిస్తోన్న అనసూయ ఇపుడు మరో రంగంలోకి అడుగుపెట్టబోతుంది.

news18-telugu
Updated: July 7, 2019, 3:01 PM IST
వామ్మో.. అనసూయ ఆ  పని కూడా కానిచ్చేస్తోంది..
జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ (ఇన్‌స్టాగ్రామ్ ఫోటో)
  • Share this:
అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ షోలో కంటెస్టెంట్స్ చేసే కామెడీ కంటే అనసూయ కోసమే చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తనదైన యాంకరింగ్‌తో గుర్తింపు పొందిన అనసూయ.. ఆ క్రేజ్‌తోనే వరుసగా సినిమా అవకాశాలను పట్టేస్తోంది. అంతేకాదు గత ఐదేళ్లుగా ఈ  ప్రోగ్రామ్‌ను తనదైన యాంకరింగ్‌తో మెప్పిస్తూ రావడం అంత ఈజీ కాదు. కానీ ఆ పనిని అనసూయ ఎంతో ఈజీగా చేస్తోంది. ప్రస్తుతం అనసూయ..చిరంజీవి, కొరటాల శివ సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు యాంకర్‌గా, నటిగా ప్రూవ్ చేసుకున్న అనసూయ.. త్వరలో నిర్మాత అవతారం ఎత్తనున్నట్టు సమాచారం.

అనసూయ భరద్వాజ్ (ఫైల్ ఫోటో)


తాజాగా అమెరికాలోని వాషింగ్‌టన్‌లో జరుగుతున్న 22వ తానా వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనసూయ. ఈ సందర్భంగా తన సన్నిహితులతో త్వరలో తాను నిర్మాతగా మారుతున్నానని చెప్పి చిన్పాటి షాకే ఇచ్చారట. అంతేకాదు లో బడ్జెట్‌లో కంటెం్ బేస్డ్ సినిమాలు తెరకెక్కించాలనే ఆలోచనలో అనసూయ ఉందట. మొత్తానికి యాంకర్‌గా, నటిగా ప్రూవ్ చేసుకున్న అనసూయ.. ఇపుడు నిర్మాతగా ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

 

First published: July 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>