అనసూయ కొత్త అవతారం వర్కవుట్ అయ్యేనా...

Anasuya Bharadwaj | ఓ వైపు బుల్లితెర కార్యక్రమాలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ క్రేజీ యాంకర్... త్వరలోనే మరో అవతారం కూడా ఎత్తబోతోందని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: July 13, 2019, 9:56 PM IST
అనసూయ కొత్త అవతారం వర్కవుట్ అయ్యేనా...
అనసూయ (Image:Twitter)
  • Share this:
తెలుగులో బుల్లితెర, వెండితెరపై యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ ఎలాంటి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్‌గా తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ... సినిమాల్లోనూ మంచి మంచి అవకాశాలను సొంతం చేసుకుంటోంది. గ్లామర్ రోల్స్‌తో పాటు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తుగా కనిపించిన అనసూయ... రోల్ ఏదైనా నటించేందుకు రెడీ అన్నట్టు సంకేతాలు పంపించింది. ఓ వైపు బుల్లితెర కార్యక్రమాలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ క్రేజీ యాంకర్... త్వరలోనే మరో అవతారం కూడా ఎత్తబోతోందని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.

మంచి కథ దొరికితే సినిమా నిర్మించేందుకు కూడా అనసూయ రెడీగా ఉందని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. మంచి కథ, తక్కువ బడ్జెట్‌లో సినిమా తెరకెక్కే అవకాశం ఉంటే... అలాంటి సినిమాను రూపొందించేందుకు తాను సిద్ధమని అనసూయ పలువురి దగ్గర వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో తాను కూడా నటించాలని భావిస్తోందట ఈ క్రేజీ యాంకర్. అయితే అనసూయ సీరియస్‌గానే సినిమా నిర్మాణంపై దృష్టి పెట్టిందా లేక అవకాశం దొరికితే సినిమా నిర్మించాలని అనుకుంటోందా అనే విషయంలో మాత్రం ఎవరికీ స్పష్టత లేదు. మొత్తానికి యాంకర్‌గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ... నిర్మాతగానూ మారుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.

First published: July 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>