Jabardasth Anasuya: అనసూయ నోటి నుంచి అలాంటి బూతు.. అనేసి నాలుక కరుచుకున్న జబర్దస్త్ యాంకర్..

జబర్దస్త్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)

Jabardasth Anasuya: జబర్దస్త్ కామెడీ షో (Jabardasth Comedy Show) అంటేనే బూతులకు అడ్డా అయిపోయిందంటూ చాలా రోజులుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే కామెడీ కోసం అప్పుడప్పుడూ లైన్ దాటడం తప్పేం కాదంటూ సపోర్ట్ చేసే వాళ్లు కూడా ఉన్నారు.

  • Share this:
జబర్దస్త్ కామెడీ షో అంటేనే బూతులకు అడ్డా అయిపోయిందంటూ చాలా రోజులుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే కామెడీ కోసం అప్పుడప్పుడూ లైన్ దాటడం తప్పేం కాదంటూ సపోర్ట్ చేసే వాళ్లు కూడా ఉన్నారు. ఎవరేం అన్నా కూడా చివరికి రేటింగ్స్ మాట్లాడుతుంటాయి. జబర్దస్త్ షోకు ఇప్పటికీ మంచి రేటింగ్స్ వస్తున్నాయి.. అక్కడ చేస్తున్న కమెడియన్లు లక్షల్లో సంపాదించుకుంటున్నారు. దాంతో రేటింగ్ ఉంది కాబట్టి వాళ్లు చేసిందే కరెక్ట్ అనే వాళ్లు కూడా లేకపోలేదు. అక్కడ నాటక మండలి నడపడం లేదు కదా.. జబర్దస్త్ అనేది పక్కా కమర్షియల్ కామెడీ ప్రోగ్రామ్.. అలాంటప్పుడు జనరంజకంగా ఉండటంలో తప్పేం లేదంటూ ఈ షోకు అండగా నిలబడేవాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే జబర్దస్త్ షో అనేది కుటుంబమంతా కలిసి చూసే విధంగా అని ఓపెన్‌గా ఓ ప్రశ్న అడిగితే మాత్రం నో అనే సమాధానమే చెప్పాల్సి వస్తుందేమో..? ఎందుకంటే అందులో డబుల్ మీనింగ్ డైలాగులు బాగానే పేలుతుంటాయి. చిన్న పిల్లలతో, తల్లి దండ్రులతో కలిసి చూసే విధంగా ఈ షో లేదనే వాదన చాలా రోజులుగా వినిపిస్తూనే ఉంది.

మరీ ముఖ్యంగా యాంకర్స్, జడ్జిలతో పాటు కమెడియన్లు కూడా హద్దులు మీరి అప్పుడప్పుడూ అనుకోకుండా బూతులు మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు అనసూయ భరద్వాజ్ విషయంలోనూ ఇదే జరిగింది. తాజాగా విడుదలైన ప్రోమోలో అమ్మడు అనుకోకుండా నోరు జారి.. ఆ తర్వాత నాలుక కరుచుకుంది.
Jabardasth Anasuya,Jabardasth Anasuya twitter,Jabardasth Anasuya instagram,Jabardasth Anasuya tongue slip,Jabardasth Anasuya boothulu,Jabardasth Anasuya adire abhi skit,telugu cinema,Jabardasth latest promo,Jabardasth hyper aadi skit,జబర్దస్త్ కామెడీ షో,అనసూయ భరద్వాజ్,నోరు జారిన జబర్దస్త్ అనసూయ భరద్వాజ్,నోరు జారి బూతు మాట్లాడేసిన అనసూయ
జబర్దస్త్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)

గత ఎపిసోడ్‌లో హైపర్ ఆదిపై నోరు జారింది అనసూయ. అమ్మాయిలు తీసుకొస్తేనేమో ఏమైనా చేస్తాడంటారు.. ఊరికే ఉంటేనేమో ఏం చేయట్లేదంటారు.. ఎలా అంటూ ఆది అంటే.. దానికి కౌంటర్‌గా ఇన్నాళ్లూ చేసావా అనేసింది అనసూయ. ఇప్పుడు విడుదలైన ప్రోమోలో అదిరే అభి స్కిట్‌లో భాగంగా సడన్‌గా బూతు మాట్లాడేసింది అనసూయ.

గుర్రానికి ముందు.. ఏనుగుకు వెనక ఉండేది ఏంటన్నా అంటూ అభిని రాము అడిగితే.. వెంటనే గు.. అంటూ నోరు జారింది అను. అది విన్న వెంటనే అక్కడున్న వాళ్లు షాక్ అయ్యారు. అభి కూడా అదేంటి అనసూయ అలా అనేసావ్ అనేసాడు. తాను బూతు మాట్లాడాననే విషయం అర్థం చేసుకుని.. సిగ్గుతో నోరు మూసుకుంది అనసూయ. కామెడీ కోసం మరీ ఇంతగా డబుల్ మీనింగ్ పంచులు వేయాల్సిన అవసరం ఉందా అంటూ కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం కామెడీలో ఇవన్నీ ఛల్తా అంటూ లైట్ తీసుకుంటున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: