Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: December 5, 2020, 11:02 PM IST
అనసూయ భరద్వాజ్ సిల్క్ స్మిత (anasuya bharadwaj silk smitha)
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. యాంకర్‌గా ఈమెకు ఫుల్ ఇమేజ్ ఉంది. సుమ కూడా అసూయ పడేంత అందం ఈమె సొంతం. అంతేకాదు కేవలం బుల్లితెరపైనే కాకుండా ఇప్పుడు వెండితెరపై కూడా రచ్చ చేస్తుంది అనసూయ. ఈ క్రమంలోనే వరస అవకాశాలు కూడా అందుకుంటుంది. ఇప్పుడు సిల్క్ స్మిత బయోపిక్‌లో అనసూయ నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే సెన్సేషనల్ సిల్క్ బయోపిక్‌ను 2011లోనే డర్టీ పిక్చర్ అంటూ తీసేసాడు బాలీవుడ్ దర్శకుడు మిలన్ లూథ్రియా. ఈ చిత్రంతోనే విద్యా బాలన్ సంచలన రికార్డులు తిరగరాసింది. అప్పట్లోనే 90 కోట్లకు పైగా వసూలు చేసింది డర్టీ పిక్చర్. అంతేకాదు సిల్క్ పాత్రలో ఒదిగిపోయినందుకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది విద్యా. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి అనసూయ భరద్వాజ్ సిల్క్ స్మిత పాత్రలో నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టాక్ రావడానికి కారణం కూడా అనసూయే.

అనసూయ భరద్వాజ్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi Anasuya Bharadwaj)
ఈ మధ్యే చెన్నైకి వెళ్లిన అనసూయ.. అక్కడ స్టార్ హీరో విజయ్ సేతుపతిని కలిసింది. అంతేకాదు ఆయన సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సిల్క్ స్మిత పుట్టిన రోజు సందర్భంగా అద్దంలో తన అందాన్ని చూసుకుంటున్న మరో ఫొటోని షేర్ చేసింది అనసూయ. 'మరో మంచి కథతో జీవితాన్ని కొనసాగించనున్నాను. సరికొత్త ఆరంభం.. కోలీవుడ్, తమిళనాడు' అని పోస్ట్ చేసింది అనసూయ. ఈ ఫోటోలను కూడా సిల్క్ స్మితను ఆధారంగా చేసుకుని దిగినట్లు చెప్పింది.

అనసూయ భరద్వాజ్ సిల్క్ స్మిత (anasuya bharadwaj silk smitha)
పైగా ఆ ఫోటోలో కూడా సిల్క్ గెటప్‌లోనే ఉంది జబర్దస్త్ యాంకర్. దాంతో ఈమె బయోపిక్‌లో నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇది సినిమాగా వస్తుందా లేదంటే జయలలిత బయోపిక్‌ను గౌతమ్ మీనన్ క్వీన్‌గా తెరకెక్కించినట్లు ఓ వెబ్ సిరీస్‌లా తెరకెక్కిస్తారా అనేది చూడాలి. ఏదేమైనా కూడా సిల్క్ స్మిత పాత్రలో కానీ అనసూయ నటిస్తే అంతకంటే సంచలనం మరోటి ఉండదేమో..? రంగమ్మత్త దెబ్బకు సౌత్ ఇండియా అంతా షేక్ అయిపోతుంది.
Published by:
Praveen Kumar Vadla
First published:
December 5, 2020, 11:02 PM IST