కేసీఆర్‌కు అనసూయ భరద్వాజ్ ట్వీట్.. ఇది తప్ప మాకేం రాదు..

Anasuya Bharadwaj: కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో మూడు నెలలుగా అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. అందులో బిజీగా ఉండే యాంకర్స్ కూడా ఉన్నారు. ఒక్కరోజు కూడా సెలవు లేకుండా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 11, 2020, 8:07 PM IST
కేసీఆర్‌కు అనసూయ భరద్వాజ్ ట్వీట్.. ఇది తప్ప మాకేం రాదు..
సీఎం కేసీఆర్‌కు అనసూయ థ్యాంక్స్ (News18/Telugu)
  • Share this:
కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో మూడు నెలలుగా అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. అందులో బిజీగా ఉండే యాంకర్స్ కూడా ఉన్నారు. ఒక్కరోజు కూడా సెలవు లేకుండా పని చేసే అనసూయ లాంటి వాళ్లకు మూడు నెలలు హాలీడేస్ రావడంతో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంట్లోనే ఉండి తాము రోజు చేసే పనులను కూడా లైవ్‌లో అభిమానులకు చూపించారు. దాంతో పాటు డాన్సులు చేస్తూ వంటలు కూడా చేసింది అనసూయ. అప్పట్లో లాక్‌డౌన్ విధించిన కొత్తలో మాకు కూడా కష్టాలుంటాయి.. మా షూటింగ్స్‌కు పర్మిషన్ ఇవ్వండి కేటీఆర్ గారూ అంటూ అనసూయ చేసిన ట్వీట్ వైరల్ అయిపోయింది.

అనసూయ భరద్వాజ్ (Anasuya bharadwaj)
అనసూయ భరద్వాజ్ (Anasuya bharadwaj)


దానిపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. అయితే మూడు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు మరోసారి ట్వీట్ చేసింది అను. ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ట్వీట్ చేసింది. తెలంగాణలో ఇకపై షూటింగ్స్, సీరియల్స్, రియాలిటీ షోలు చేసుకోవచ్చంటూ ఫైల్‌పై సంతకం చేసాడు కేసీఆర్. దాంతో సినిమా ఇండస్ట్రీ పెద్దలతో పాటు ప్రముఖులు కూడా ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నారు.

అందులో అనసూయ భరద్వాజ్ కూడా ఉంది. షూటింగ్స్ చేసుకోడానికి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గారికి థ్యాంక్స్.. సినీ పరిశ్రమలో అన్ని వర్గాల్లో ఉన్న వాళ్లకు ఇది నిజంగానే శుభవార్త.. షూటింగ్స్ సమయంలో కరోనా పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పని చేస్తామని మీకు హామీ ఇస్తున్నాము.. ఎంటర్‌టైన్‌మెంట్ తప్ప మాకు ఇంకే పని రాదు అంటూ ట్వీట్ చేసింది అనసూయ. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: June 11, 2020, 8:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading