Anasuya Bharadwaj: వాళ్లను కోర్టుకు ఈడుస్తా.. మా ఎన్నికల తర్వాత అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్..

Anasuya Photo : Instagram

Anasuya Bharadwaj: మా ఎన్నికల తర్వాత వేడి మామూలుగా రావడం లేదు. ఎవర్ని కదిపినా కూడా మంటై మండిపోతున్నారు. ముఖ్యంగా మా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఈ వేడి ఇంకా చల్లారకపోవడం ఇదే తొలిసారి కావచ్చు. తాజాగా అనసూయ (Anasuya Bharadwaj) కూడా మీడియాపై చిందులు తొక్కింది.

  • Share this:
మా ఎన్నికల తర్వాత వేడి మామూలుగా రావడం లేదు. ఎవర్ని కదిపినా కూడా మంటై మండిపోతున్నారు. ముఖ్యంగా మా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఈ వేడి ఇంకా చల్లారకపోవడం ఇదే తొలిసారి కావచ్చు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులంతా రాజీనామా చేయడంతో విషయం మరింత పెద్దదైపోయింది. ఇదిలా ఉంటే ఇదే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా మీడియాతో మాట్లాడింది. తన గెలుపు గురించి మీడియా ఛానెల్స్‌లో వచ్చిన వార్తలపై ఆమె ప్రశ్నల వర్షం కురిపించింది. లోపల ఇంకా ఓట్ల లెక్కింపు కూడా మొదలు కాకుండానే అనసూయ గెలిచింది అంటూ ఎలా మీడియాలో వేస్తారు అంటూ ఆమె ప్రశ్నించింది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు.. ఎలా మీరు నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాస్తారు అంటూ ఫైర్ అయిపోయింది అనసూయ. ఆ రోజు ఎవరు చెప్తే మీరు బ్రేకింగ్ వేసారంటూ అనసూయ ప్రశ్నించగా.. అక్కడున్న మీడియా ప్రతినిథులంతా తమకు ఇన్ పుట్స్ వచ్చాయని చెప్పారు.

నేను కూడా మీడియా నుంచే వచ్చాను.. నేను కానీ ఇప్పటికీ మీడియాలో ఉండుంటే న్యూస్ రిపోర్ట్ చేస్తాను.. క్రియేట్ చేయను.. న్యూసెన్స్ రాయను అంటూ మండిపడింది అనసూయ. ఆ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు చిరాకు పడుతూ సమాధానం చెప్పింది ఈ యాంకర్. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత తాను తన పాటికి వెళ్లిపోతుంటే.. మీరే నన్ను ఆపి మరీ ప్రశ్నలు అడుగుతున్నారంటూ అనసూయ చిరాకుగా సమాధానం చెప్పింది. అంతేకాదు అక్కడ్నుంచి వెళ్లిపోతూ మీడియాపై చిందులు తొక్కేసింది.

Mohan Babu - Benerjee: కొట్టడానికి వచ్చిన మోహన్ బాబు.. అరగంట సేపు బూతులు.. ఏడ్చేసిన బెనర్జీ..



చేసేదంతా మీరే.. మళ్లీ ఇప్పుడు నన్ను అంటున్నారంటూ అరిచేసింది. ఇప్పట్నుంచి తన ప్రమేయం లేకుండా తప్పుడు వార్తలకు తన పేరు వాడితే కచ్చితంగా కోర్టుకు వెళ్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. నిజానిజాలు తెలుసుకోకుండా అనసూయ అనే పేరు కానీ యూ ట్యూబ్ ఛానెల్స్‌లో కానీ.. న్యూస్ ఛానెల్స్‌లో కానీ కనిపించిందంటే మాత్రం కచ్చితంగా కోర్టుకు వెళ్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అనసూయ. మరోవైపు మీడియా ప్రతినిథుల నుంచి కూడా అనసూయకు అదే స్థాయిలో సమాధానాలు వచ్చాయి.
Published by:Praveen Kumar Vadla
First published: