జబర్దస్త్ కామెడీ షోలో చాలా మంది ఉంటారు కానీ హైపర్ ఆది, అనసూయ మధ్య ఉండే కెమిస్ట్రీ మాత్రం చాలా స్పెషల్. నిజానికి వాళ్లిద్దరి మధ్య ఆకాశం, నేలకు ఉన్నంత తేడా ఉంటుంది. కానీ తన ప్రతీ స్కిట్ కోసం అనసూయను వాడేస్తుంటాడు ఆది. లేదంటే అనసూయ కూడా అసూయ పడేలా మరో అమ్మాయిని తీసుకొస్తుంటాడు. ఇదే సక్సెస్ ఫార్ములాతో అలా వెళ్లిపోతున్నాడు ఈయన. అప్పుడప్పుడూ ఆది స్కిట్స్ కోసం వేసే పంచులు.. రాసుకునే డైలాగులు బయట కూడా బాగానే పాపులర్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తన స్కిట్ కోసం రాసుకున్న మాటల్లోనే అనసూయపై అదిరిపోయే సెటైర్లు వేసాడు ఈ కమెడియన్.
ముఖ్యంగా అను రెమ్యునరేషన్ గురించి కూడా చెప్పేసాడు హైపర్ ఆది. దాంతో జబర్దస్త్ బ్యూటీ కూడా స్టేజీపైనే వార్నింగ్ ఇచ్చింది. వచ్చే వారం ఎపిసోడ్లో భాగంగా ఓ స్కిట్ చేసాడు ఆది. అందులో అనసూయ చిన్నప్పటి కారెక్టర్ కూడా ఉంటుంది. అప్పట్నుంచే పక్కన టచ్ అప్ అంటూ మేకప్ మెన్ ఉంటాడు. అక్కడ్నుంచి మొదలైన పంచుల ప్రవాహం పెద్దైన తర్వాత కూడా కొనసాగుతుంది. అనసూయ గారూ మీరు భలే మేనేజ్ చేస్తారండీ అంటే ఆ అందుకేగా అక్కడా ఇక్కడా రెండు చోట్లా బ్యాలెన్స్ చేస్తుందంటూ ఆది పంచ్ వేసాడు.
ఆ తర్వాత మూడంతస్థుల మేడ కట్టారు అంటే వెంటనే ఎందుకు కట్టదు.. ఆమెకు ఈవెంట్‌కు 3 లక్షలు ఇస్తారు.. మాకు లక్ష ఇస్తారంటూ రెమ్యునరేషన్‌పై సెటైర్ వేసాడు. దాంతో వెంటనే అనసూయ నా మీద పడి ఏడుస్తావ్ ఎందుకు ఆది అన్నట్లుగా అతడి వైపు కోపంగా చూస్తుంది. ఈ పంచులు అయితే బాగానే పేలాయి.. అక్కడ ఆది రాసిన డైలాగులు కూడా కామెడీ కోసమే అయినా రెమ్యునరేషన్ మాత్రం నిజమే అంటున్నారు అభిమానులు. ఏదేమైనా కూడా అనసూయను వాడకుండా స్కిట్ మాత్రం పూర్తి చేయడం లేదు హైపర్ ఆది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anasuya Bharadwaj, Hyper Aadi, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood