హోమ్ /వార్తలు /సినిమా /

అమ్మో అనసూయ ఏంటీ గెటప్.. హాలీవుడ్ హీరోయిన్‌వా..?

అమ్మో అనసూయ ఏంటీ గెటప్.. హాలీవుడ్ హీరోయిన్‌వా..?

ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సైతం తన మనసులో మాట చెప్పుకొచ్చింది. కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి.. తనకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడింది ఈ ముద్దుగుమ్మ. తన వరకు అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని చెప్పుకొచ్చింది అనసూయ.

ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సైతం తన మనసులో మాట చెప్పుకొచ్చింది. కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి.. తనకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడింది ఈ ముద్దుగుమ్మ. తన వరకు అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని చెప్పుకొచ్చింది అనసూయ.

Anasuya Bharadwaj: ఇప్పుడు అనసూయ భరద్వాజ్ కొత్త లుక్ చూసిన తర్వాత అంతా ఇదే అంటున్నారు. మూడు నెలల తర్వాత షూటింగ్స్‌తో బిజీ అయిపోయారు యాంకర్స్. అందులో భాగంగానే కొందరు తమకు..

ఇప్పుడు అనసూయ భరద్వాజ్ కొత్త లుక్ చూసిన తర్వాత అంతా ఇదే అంటున్నారు. మూడు నెలల తర్వాత షూటింగ్స్‌తో బిజీ అయిపోయారు యాంకర్స్. అందులో భాగంగానే కొందరు తమకు నచ్చినట్లు గెటప్స్ మార్చుకుని షోలు చేస్తున్నారు. ఇందులో ఇప్పుడు అనసూయ కూడా కొత్త లుక్ ట్రై చేసింది. ఏదో కాస్త కొత్తగా కాదు.. మరీ కొత్తగా.. గుర్తు పట్టలేనంతగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. జబర్దస్త్ పోరీని చూసి వామ్మో ఇదేంటి అనసూయ ఇలా అయిపోయింది అంటూ అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఇక నెటిజన్లు కూడా తమ చేతికి పని చెబుతున్నారు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు.

అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj)
అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj)

భుజాల వరకూ తన జుట్టును కట్ చేసి దానిని రింగ్‌లు తిప్పి.. పైగా బ్రౌన్ కలర్ వేసుకుంది. దాంతో చూడ్డానికి తెలుగమ్మాయిలా కాకుండా ఏకంగా హాలీవుడ్ నుంచి భామలా మారిపోయింది. ఈ లుక్ చూడగానే కొందరు షాక్ అయిపోయారు.. అన్నింటికీ మించి హెయిర్ స్టైల్‌కు సరిపోయేలా అదే కలర్ లిప్ స్టిక్ కూడా వేసుకోవడంతో ఇంగ్లీష్ అమ్మాయిలా కనిపిస్తుంది అనసూయ. తెలుగమ్మాయిలు అనుకుంటే హాలీవుడ్ వాళ్ల కంటే అందంగా కనిపిస్తారంటూ పోస్ట్ చేసింది ఈమె.


అనసూయలో ఉన్నట్లుండి ఇంత మార్పు రావడానికి హెయిర్ స్టైలిస్ట్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ సచిన్ డకోజి. ఈమే అనసూయను పూర్తిగా మార్చేసింది. పైగా అనసూయకు హెయిర్ స్టైలింగ్ చేస్తుండగా వీడియో తీసి.. దానిని కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది డికోచీ. దాంతో వెంటనే లుక్ వైరల్ అయిపోయింది. వచ్చే వారం జబర్దస్త్‌లో అనసూయ ఈ కొత్త గెటప్‌లోనే కనిపించబోతుంది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anasuya Bharadwaj, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు