హైపర్ ఆది ఓవరాక్షన్ పై అనసూయ భరద్వాజ్ ఫైర్..

జబర్ధస్త్ కామెడీ షోతో స్టార్ కమెడియన్ స్టేటస్ అందుకున్నాడు హైపర్ ఆది. జబర్ధస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా జబర్ధస్త్‌లో జరిగిన ఓ స్కిట్ విషయంలో అనసూయ.. హైపర్ ఆది పై సీరియస్ అయినట్టు సమాచారం.

news18-telugu
Updated: July 18, 2019, 5:52 PM IST
హైపర్ ఆది ఓవరాక్షన్ పై అనసూయ భరద్వాజ్ ఫైర్..
అనసూయ,హైపర్ ఆది (ఫైల్ ఫోటోస్)
  • Share this:
జబర్ధస్త్ కామెడీ షోతో స్టార్ కమెడియన్ స్టేటస్ అందుకున్నాడు హైపర్ ఆది. జబర్ధస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక జబర్ధస్త్‌లో పాపులర్ అయిన హైపర ్ఆది.. అదే ఊపుతో సినిమాల్లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ హైపర్ ఆది పంచ్‌లు మాత్రం పేలలేదు. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పి ..తనకు అచ్చొచ్చిన జబర్ధస్త్ షోనే నమ్ముకున్నాడు. ఒక్క హైపర్ ఆది మాత్రమే  కాదు.. జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ల‌కు సినిమాలు అంత‌గా క‌లిసి రాలేదు. కానీ గత ఎన్నో ఎసిపోడ్స్‌లో హైపర్ ఆది..తన స్కిట్స్‌లో ఏదో ఒక సమయంలో అనసూయను కవ్విస్తూ కామెడీ చేస్తుంటాడు. ఇక అనసూయ కూడా హైపర్ ఆది చేసే ఇలాంటి స్కిట్స్‌ను ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఇక షో జడ్జెస్ నాగబాబు, రోజా కూడా హైపర్ ఆది చేసే స్కిట్స్‌ను పడి పడి నవ్వేవారు. కానీ గత కొన్ని ఎపిసోడ్స్‌లో హైపర్ ఆది చేసే స్కిట్స్‌లో అనసూయ పై చేసే కామెడీ తారా స్థాయికి చేరింది. దీంతో జబర్దస్త్ షో తర్వాత హైపర్ ఆదికి అనసూయ.. కాస్తంత గట్టిగానే క్లాస్ పీకినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రోజా,నాగబాబు కూడా హైపర్ ఆది చేసే స్కిట్స్ విషయంలో కాస్తంత సీరియస్ అయినట్టు సమాచారం. మరి ఇక హైపర్ ఆది ఎపిసోడ్‌తో మిగతా జబర్ధస్త్ పార్టిసిపేట్స్ కూడా ఒళ్లు దగ్గర పెట్టుకొని స్కిట్స్‌ను సరైన పద్ధతిలో వేస్తారా ? ఒకవేళ వేసినా ఆడియన్స్ ఆదరిస్తారా అనేది చూడాలి.

First published: July 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు