ఇలాంటి వెధవల్ని జైల్లో పడేయాలి.. అనసూయ సీరియస్..

Anasuya Bharadwaj: సినిమాలు.. టెలివిజన్ షోలు మాత్రమే కాదు తమకు సామాజిక బాధ్యత కూడా ఉందని నిరూపించుకుంటున్నారు జబర్దస్త్ యాంకర్స్ అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 17, 2020, 3:27 PM IST
ఇలాంటి వెధవల్ని జైల్లో పడేయాలి.. అనసూయ సీరియస్..
అనసూయ (Anasuya Bharadwaj)
  • Share this:
సినిమాలు.. టెలివిజన్ షోలు మాత్రమే కాదు తమకు సామాజిక బాధ్యత కూడా ఉందని నిరూపించుకుంటున్నారు జబర్దస్త్ యాంకర్స్ అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్. ఎవరికి వాళ్లు తమకు తోచిన విధంగా అందర్నీ ఎడ్యుకేట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అనసూయకు ఓ వీడియో చూసి చాలా కోపం వచ్చింది. వెంటనే ఆ లింక్ తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసి ఇలాంటి వాళ్లను ఏం చేసినా పాపం లేదంటూ మండి పడింది. ప్రస్తుతం టిక్ టాక్ రాజ్యం నడుస్తుంది. ఏం చేసినా కూడా అందులో పెట్టేస్తున్నారు. అందులో చాలా ఈజీగా ఫేమ్ కూడా వచ్చేస్తుంది. అందుకే అంతా జై టిక్ టాక్ అంటున్నారు.

అనసూయ (Anasuya Bharadwaj)
అనసూయ (Anasuya Bharadwaj)


అందులోనూ ఇప్పుడు లాక్ డౌన్ నడుస్తుండటంతో టిక్ టాక్ ఫాలోయర్స్ ఇంకా పెరిగిపోతున్నారు. అయితే అందులో ఎంటర్‌టైన్మెంట్ కోసం చేసే వీడియోలు సరే కానీ కొందరు మాత్రం కావాలనే కొన్ని చెత్త వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా అనసూయకు అలాంటి వీడియో ఒకటి తగిలింది. అసలే కరోనా వైరస్ విళయ తాండవం చేస్తున్న ఈ సమయంలో దాన్ని వ్యాప్తి చెందేలా చేసిన ఓ వీడియోను చూసి అనసూయకు మండిపోయింది. వెంటనే సీరియస్ అయింది.. ఆ లింక్ పోస్ట్ చేసి ఇలాంటి వాళ్లను ఏం చేసినా తప్పులేదు.. ఎవర్ని నిందించాలో కూడా అర్థం కావడం లేదంటూ పోస్ట్ చేసింది.

అనసూయ (Anasuya Bharadwaj)
అనసూయ (Anasuya Bharadwaj)


సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా.. ఇలాంటి చెత్త వీడియోలు పోస్ట్ చేస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తుంది అనసూయ. పైగా ఆ వీడియో చేసిన వాడికి ఏకంగా 11.8 మిలియన్స్ మంది అతన్ని ఫాలో అవుతున్నారంటే స్టార్ హీరోకు కూడా ఏ మాత్రం తీసిపోని రేంజ్ మనోడిది. వీడియోలో ఆ యువకుడు తన స్నేహితుడితో కలిసి అటూ ఇటూ ఆడుకుంటూ వెళ్తుంటాడు.. ఎదురుగా ఓ అమ్మాయి వస్తున్న విషయాన్ని పట్టించుకోకుండా ఆమెకు డ్యాష్ ఇస్తాడు.. దీంతో వెంటనే ఆమెకు కోపం వచ్చి అతన్ని కొడుతుంది.. దీనికి ప్రతీకారంగా ఆ యువకుడు తన స్నేహితుడు ఇద్దరూ తన అరచేతిపై ఉమ్మి వేసి ఆ అమ్మాయి వద్దకు వెళ్లి సారీ చెబుతున్నట్లు నటించి.. షేక్‌ హ్యాండ్‌ ఇస్తాడు.


దీంతో అది ఆమెకు అంటుతుంది.. ఆ తర్వాత అతడు హీరోలా తన స్నేహితుడితో కలిసి పోజులు కొడుతూ వెళ్లిపోయాడు.. దీనికి మళ్లీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది. ఇది చూసి అనసూయకు మండిపోయింది. ఈ టిక్ టాక్ అకౌంట్ వెంటనే సస్పెండ్ చేయాలని ఆమె కోరింది. ఈ అకౌంట్ షాదాబ్‌ ఖాన్‌ అనే ఆ యువకుడి పేరు మీదుంది. ఇలాంటి వ్యక్తిని ఫాలో అవుతున్న వాళ్లను నిందించాలా.. లేదంటే ఇతన్నే నిందించాలా అర్థం కావడం లేదు.. వెంటనే ఇతడి ఖాతాను తొలగించాలని నేను టిక్‌టాక్‌ ఇండియాను కోరుతున్నాను అంటూ ట్వీట్ చేసింది అనసూయ భరద్వాజ్.
Published by: Praveen Kumar Vadla
First published: April 17, 2020, 3:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading