KCR, జగన్ ప్రభుత్వాలపై నిప్పులు చెరిగిన జబర్దస్త్ అనసూయ భరద్వాజ్..

అనసూయ భరద్వాజ్ కేవలం సినిమాలు, రియాలిటీ షోలతోనే కాదు.. సామాజిక బాధ్యత విషయంలో కూడా ముందే ఉంటుంది. నిజంగానే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ తీరును ఈమె తప్పు పట్టింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 12, 2019, 7:18 PM IST
KCR, జగన్ ప్రభుత్వాలపై నిప్పులు చెరిగిన జబర్దస్త్ అనసూయ భరద్వాజ్..
అనసూయ భరద్వాజ్ ఫోటో (instagram.com/itsme_anasuya)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 12, 2019, 7:18 PM IST
అనసూయ భరద్వాజ్ కేవలం సినిమాలు, రియాలిటీ షోలతోనే కాదు.. సామాజిక బాధ్యత విషయంలో కూడా ముందే ఉంటుంది. నిజంగానే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ తీరును ఈమె తప్పు పట్టింది. దాంతో పాటు కేంద్రంపై కూడా మాటల తూటాలు పేల్చింది. దానికతోడు రెండు తెలుగు రాష్ట్రాల అటవీ శాఖ మంత్రులపై కూడా మండిపడింది. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల కోసం కేంద్రం ఇచ్చిన అనుమతితో ఇప్పుడు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంది. దీనికి పవన్ కల్యాణ్ సహా విజయ్ దేవరకొండ, శేఖర్ కమ్ముల లాంటి ఎందరో సినిమా వాళ్లు సపోర్ట్ తెలియచేస్తున్నారు.


ఇక ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఇదే చేసింది. ఈమె కూడా ఇప్పుడు సేవ్ నల్లమల అంటూ ఉద్యమిస్తుంది. తాజాగా ఈమె చేసిన ట్వీట్స్ సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర మంత్రులపై మండిపడింది ఈమె. అడవుల్లోని చెట్లను కొట్టేస్తే రేపటి తరం గాలిని కూడా కొనుక్కొని బతకాల్సిన గతి పడుతుంది కదా అంటూ సెటైర్లు వేసింది అనసూయ. మనం ఏం చేస్తున్నాం.. అభివృద్ధా లేదంటే నాశనమా.. ఏం ఉద్ధరిద్దామని.. మనకు మనం చెంపల మీద కొట్టుకుందాం అంటూ రెచ్చిపోయింది అనసూయ.




ఇప్పుడే సెల్ఫ్ ఎడ్యుకేట్ చేసుకున్నా.. కరెంట్ జనరేట్ చేయడానికి యురేనియం కావాలంట.. నాచురల్‌గా పీల్చే స్వచ్ఛమైన గాలిని ఇచ్చే చెట్లను నరికి.. ఎలక్ట్రానిక్ డివైస్ నుంచి రానున్న రోజుల్లో కొనే వాళ్లకే గాలి.. లేదంటే ఊపిరి ఆడక చావు అంతేగా మన డెవలప్‌మెంట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అనసూయ. ఈ విషయాన్ని దయచేసి పట్టించుకోండి అంటూ తెలంగాణ అటవిశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. ఏపీ అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు ట్వీట్ చేసింది ఈ జబర్దస్త్ యాంకర్.
First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...