హోమ్ /వార్తలు /సినిమా /

అనసూయ భరద్వాజ్ సంచలన ట్వీట్.. వాళ్లను మొరిగే కుక్కలంటూ..

అనసూయ భరద్వాజ్ సంచలన ట్వీట్.. వాళ్లను మొరిగే కుక్కలంటూ..

అనసూయ భరద్వాజ్ హాట్ షో (Anasuya Bharadwaj hot)

అనసూయ భరద్వాజ్ హాట్ షో (Anasuya Bharadwaj hot)

Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ భరద్వాజ్ కాంట్రవర్సీలు కూడా బాగానే సృష్టిస్తుంటుంది. అప్పుడప్పుడూ ఈమె ఈమె చేసే పోస్టులు కొన్ని చాలా సంచలనాలు క్రియేట్ చేస్తుంటాయి.

యాంకర్ అనసూయ భరద్వాజ్ కాంట్రవర్సీలు కూడా బాగానే సృష్టిస్తుంటుంది. అప్పుడప్పుడూ ఈమె ఈమె చేసే పోస్టులు కొన్ని చాలా సంచలనాలు క్రియేట్ చేస్తుంటాయి. మొన్నటికి మొన్న విజయ్ దేవరకొండ ఫేక్ న్యూస్‌పై యుద్ధం ప్రకటిస్తూ వీడియో విడుదల చేసిన వెంటనే అనసూయ చేసిన ట్వీట్ సంచలనాలు రేపింది. ఓహో మన వరకు వస్తే కానీ నొప్పి తెలియదన్నమాట అంటూ అనసూయ చేసిన ట్వీట్ రచ్చ చేసింది. విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూనే ఈమె ఈ ట్వీట్ చేసిందంటూ మండిపడ్డారు అభిమానులు. ఇండస్ట్రీ అంతా విజయ్‌కు సపోర్ట్ చేస్తుంటే అనసూయ మాత్రం అలా చేయడం ఏంటి అంటూ ఫ్యాన్స్ అంతా ఆడుకున్నారు ఆమెను.

దాంతో ఇప్పుడు వరస ట్వీట్స్‌తో విరుచుకుపడింది అనసూయ. మీకు జీవితంలో బుద్ది రాదు అంటూ రెచ్చిపోయింది. రకరకాల అపోహాలకు తావిస్తున్నారు.. మ్యానిపులేషన్స్‌ కూడా జరుగుతున్నాయని ట్వీట్ చేసింది.

ఇప్పటికీ దుర్వినియోగం చేయడం.. మనుషులను ద్వేషించడం ఆగడం లేదని వాపోయింది. ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం.. ఒకరిని మరొకరు ఏమార్చుకోవడం జరుగుతున్నాయని అనసూయ చెప్పుకొచ్చింది. మనమంతా ట్రాక్ తప్పుతున్నామా అనే అనుమానాలు వస్తున్నాయని చెప్పింది ఈమె.

ఇలాంటి విషయాల నుంచి బయటపడి కాస్త మంచిని ఫాలో అయితే బాగుంటుంది కదా.. ఏదైనా కొత్తది నేర్చుకుంటే బాగుంటుంది కదా అని ట్వీట్ చేసింది అనసూయ. దాంతో పాటు ఒకరికి మరొకరికి మధ్య నెగిటివిటే ఉందని చెప్పుకొచ్చింది. రకరకాల గ్రూపుల మధ్య వివాదాలు చూస్తే సిగ్గు పడాల్సి వస్తుందని వాపోయింది అనసూయ. చాలా విషయాలను కళ్ల ముందు చూస్తూ కూడా తనతో సహా అంతా ఏం నేర్చుకోవడం లేదని చెప్పింది ఈమె. సాయం చేసే గుణం.. ఒకర్ని మరొకరు రక్షించే గుణం ఇంకెప్పుడు నేర్చుకుంటామంటూ కొటేషన్స్ కూడా పెట్టింది అనసూయ.

విద్వేషాన్ని వీడి ఎప్పుడు ఏకమవుతాం.. ఒకరిపై మరొకరు బురద జల్లుకోవడం ఆపుదామా లేదా అంటూ మండి పడింది. మొరిగే కుక్కలపై రాళ్లు విసరడం ఆపకపోతే నీ లక్ష్యాన్ని నీవు ఎప్పటికీ చేరుకోలేవు అంటూ అనసూయ ఘాటుగా స్పందించింది. ప్రస్తుతానికి ఈమె చేసిన ట్వీట్స్ వివాదాస్పదం అవుతున్నాయి. ఆ మొరికే కుక్కలు అభిమానులా లేదంటే హీరోలా అంటూ రిప్లై ఇస్తున్నారు నెటిజన్లు. ముందు మీరు కూడా రాళ్లు వేయడం ఆపండి అనసూయ గారూ అంటూ మరికొందరు కూడా సెటైర్లు వేస్తున్నారు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anasuya Bharadwaj, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు