Anasuya Bharadwaj: అనసూయ సంచలన నిర్ణయం.. మరోసారి అలాంటి పాత్రలు చేయనంటున్న జబర్ధస్త్ భామ..

అనసూయ భరద్వాజ్ (Anasuya Photo : Twitter)

Anasuya Bharadwaj: జబర్ధస్త్ యాంకర్ అనసూయ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాదు మరోసారి అలాంటి పాత్రలు చేయనంటున్న జబర్ధస్త్ భామ.

  • Share this:
    Anasuya Bharadwaj: జబర్ధస్త్ యాంకర్ అనసూయ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాదు మరోసారి అలాంటి పాత్రలు చేయనంటున్న జబర్ధస్త్ భామ. గత కొన్నేళ్లుగా అనసూయ భరద్వాజ్.. ఒకవైపు జబర్ధస్త్ కామెడీ షోకు యాంకరింగ్ చేస్తూనే.. సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. యాంకర్స్ సినిమాలకు ఏం పనికి వస్తారనేవారికి తనదైన నటనతో గట్టి జవాబు చెప్పింది. అంతేకాదు సినిమా దర్శక, నిర్మాతలు హీరోలు కూడా తమ సినిమాల్లో అనసూయ నటిస్తే క్రేజ్ వస్తుందనే కారణంతో ఆమెకు వరుసగా అవకాశాలిస్తున్నారు. అందులో భాగంగా అనసూయ తన పాత్ర ఎలాంటిదో  తెలుసుకోకుండా  కూడా ఎడా పెడా కొన్ని సినిమాలకు సైన్ చేసింది. అందులో కొన్ని అనసూయ కొన్ని ఐటెం సాంగ్స్‌కు కూడా ఓకే చేసింది. అందులో సాయి ధరమ్ తేజ్.. విన్నర్ సహా కొన్ని సినిమాలున్నాయి. తాజాగా ‘చావు కబురు చల్లగా’ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసింది. ఈ సినిమాలో చేసిన అవసరమని వేడుకుంటారు. అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరాక ఆడుకుంటారు. పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

    కానీ  ఈ సినిమా తర్వాత తాను ఇక ఏ సినిమాలో ఐటెం సాంగ్ చేయనని తెగేసి చెబుతోంది. అంతేకాదు సినిమాల్లో కూడా తన పాత్ర నచ్చితేనే నటిస్తానని చెబుతోంది. మొత్తంగా అనసూయ భరద్వాజ్ ఇకపై ఏ సినిమాలో ఐటెం సాంగ్స్ చేయకూడదనే నిర్ణయానికి వచ్చింది. అనసూయ డెసిషన్ పై మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. జబర్ధస్త్ షో స్టార్టింగ్‌లో వివిధ పాటలకు అనసూయ ఆయా పాటలకు డాన్సులు గట్రా చేస్తోంది. కానీ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తే పెద్ద తప్పేం  కాదని అంటున్నారు. ఏమైనా అనసూయ ముందు.. తన నిర్ణయాన్ని మార్చుకుంటారా లేదా అనేది చూడాలి.

    anasuya bharadwaj,anasuya bharadwaj item song,anasuya bharadwaj item song in chavu kaburu challaga,anasuya bharadwaj bikini,anasuya bharadwaj bikini photos,anasuya bharadwaj wearing bikini,anasuya bharadwaj hot bikini,anchor anasuya bharadwaj,anchor anasuya bharadwaj hot photos,anchor anasuya bharadwaj hot,anchor anasuya bharadwaj photos,anchor anasuya bharadwaj age,anchor anasuya bharadwaj husband,anchor anasuya bharadwaj twitter,anchor anasuya bharadwaj instagram,jabardasth comedy show,anchor anasuya bharadwaj jabardasth comedy show,anchor anasuya bharadwaj movies,anchor anasuya bharadwaj yatra,anchor anasuya bharadwaj rangasthalam,telugu cinema,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ సినిమాలు,అనసూయ భరద్వాజ్ జబర్దస్త్,అనసూయ భరద్వాజ్ యాంకర్,అనసూయ భరద్వాజ్ బికినీ,అనసూయ భరద్వాజ్ రంగస్థలం,అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా,అనసూయ చావు కబురు చల్లగా ఐటం సాంగ్
    ‘చావు కబురు చల్లగా’లో అనసూయ ఐటెం సాంగ్ (Twitter/Photo)


    ప్రస్తుతం అనసూయ కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ'లో నటిస్తోంది. దాంతో పాటు సునీల్ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నట్టు సమాచారం. ఇంకోవైపు చిరంజీవి, రామ్ చరణ్‌ల ఆచార్యతో పాటు, అల్లు అర్జున్, సుకుమార్‌ల ‘పుష్ప’ సినిమాతో పాటు మలయాళ సినిమా ‘భీష్మ పర్వం’ సినిమాలో యాక్ట్ చేస్తోంది. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తోన్న ‘పక్కా కమర్షియల్’ సినిమాలో ఈమె ప్రాస్టిట్యూట్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. త్వరలో ఈ సినిమా విషయమై అఫీషియల్ ప్రకటన చేయనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: