యాంకర్ అనసూయకు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా..?

Anasuya Bharadwaj: అనసూయ.. పేరు చూస్తే పాత చింతకాయ పచ్చడిలా ఉంటుంది.. కానీ అమ్మాయి మాత్రం ఆల్ట్రామోడ్రన్‌గా ఉంటుంది. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం అనసూయ సొంతం.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 12, 2020, 4:28 PM IST
యాంకర్ అనసూయకు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా..?
అనసూయ భరద్వాజ్ (Image: Anasuya/Facebook)
  • Share this:
అనసూయ.. పేరు చూస్తే పాత చింతకాయ పచ్చడిలా ఉంటుంది.. కానీ అమ్మాయి మాత్రం ఆల్ట్రామోడ్రన్‌గా ఉంటుంది. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం అనసూయ సొంతం. కానీ పేరు మాత్రం అలా ఎందుకు ఉంది అంటూ చాలా మందిలో ఓ అనుమానం కూడా ఉంది. అనసూయ ఏంటి అనసూయ.. పాష్‌గా ఉండే పేరు పెట్టుకోవచ్చు కదా.. కనీసం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతైనా మార్చుకోవచ్చు కదా అంటూ చాలా మంది ఈమెకు ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. కానీ అను మాత్రం దానికి ఒప్పుకోలేదు. ఇప్పటికీ తన పేరంటే తనకు చాలా యిష్టం అని చెబుతుంది.
అనసూయ (Anasuya Bharadwaj)
అనసూయ (Anasuya Bharadwaj)


అసలు ఈ రోజుల్లో ఉండాల్సిన పేరు కాదు ఇది.. ఎందుకు ఇంత పాత పేరు పెట్టుకున్నారు మీరు అంటూ చాలా మంది ఈమెను అడిగారు కూడా. అన్నిసార్లు నవ్వుతూనే సమాధానమిచ్చింది అనసూయ. అయితే ఇప్పుడు ఈ పేరు వెనక ఉన్న కథేంటో బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. కోవిడ్ 19 కారణంగా ఇంట్లోనే ఉండిపోవడంతో రోజూ అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంది ఈ భామ. ఎవడైనా ఎక్స్‌ట్రాలు చేస్తే సోషల్ మీడియాలో అందరి ముందు కడిగేస్తుంది అనసూయ. దాంతో పాటే వ్యక్తిగత విషయాలను కూడా దాచుకోకుండా చెబుతుంది ఈ బ్యూటీ.
అనసూయ భరద్వాజ్ (Image: Anasuya/Facebook)
అనసూయ భరద్వాజ్ (Image: Anasuya/Facebook)

ఈ క్రమంలోనే తన పేరు వెనక మిస్టరీని కూడా చెప్పేసింది. ఇది తన నాన్నమ్మ పేరని.. అందుకే ఈ పేరు పెట్టారని చెబుతుంది అనసూయ. నాన్నకు వాళ్లమ్మ అంటే చాలా యిష్టమని.. అందుకే తనకు ఈ పేరు పెట్టుకున్నాడని చెప్పింది ఈమె. చాలామంది ఈ పేరు పాతగా ఉందని చెప్పినా కూడా అద్భుతంగా ఉందంటూ పొగిడారని గుర్తు చేసుకుంది అనసూయ. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా తన పేరుతో ఎప్పుడూ సమస్య రాలేదని చెప్పింది ఈమె. ప్రస్తుతం యాంకర్‌గానే కాకుండా నటిగా కూడా వరస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది ఈ జబర్దస్త్ భామ.
First published: April 12, 2020, 4:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading