హోమ్ /వార్తలు /సినిమా /

అభిమానులకు కొత్త వంటకం పరిచయం చేసిన అనసూయ.. వావ్ అంటున్న ఫ్యాన్స్..

అభిమానులకు కొత్త వంటకం పరిచయం చేసిన అనసూయ.. వావ్ అంటున్న ఫ్యాన్స్..

అనసూయ భరద్వాజ్ (Instagram/Photo)

అనసూయ భరద్వాజ్ (Instagram/Photo)

అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది.తాజాగా ఈమె చేసిన వంటకాన్ని తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

    అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అంతేకాదు స్మాల్ స్క్రీన్‌కు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు. అయితే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అంతేకాకుండా అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇప్పటికే టీవీలతో పాటు సినిమాల్లో రఫ్ ఆడిస్తున్న ఈ భామ.. త్వరలో బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం. తాజాగా లాక్‌డౌన్ సందర్భంగా అందరితో పాటు ఈమె కూడా ఇంటికే పరిమితమైంది. తాజాగా ఈమె ఫాలోవర్స్ కోరిక మేరకు తన ఇంట్లోనే ఓట్స్‌తో  రెసిపీను చేసినట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను విడుదల చేసింది. ఇపుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Anasuya Bharadwaj, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు