అప్పుడెప్పుడో 17 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ. ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ అయిపోయింది.. వెంటనే జబర్దస్త్ యాంకర్ అయిపోయింది.. ఆ తర్వాత నటిగా మారింది.. ఇప్పుడు స్టార్ అయిపోయింది. అన్నింటికి మించి అనసూయకు పెళ్లై అప్పుడే పదేళ్లైపోయింది. ఇంత చరిత్ర చూస్తుంటే అసలు అనసూయకు ఎంత వయసు ఉంటుందనే అనుమానాలు చాలా మందిలో వస్తుంటాయి కూడా. ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడూ అసలు వయసు చెప్పరు.. దాచేస్తుంటారు. అనసూయ కూడా అంతే అయ్యుంటుంది.. అసలు ఈమె వయసు ఎంతుంటుంది అని నెటిజన్లు ఎప్పుడూ ఆరా తీస్తూనే ఉంటారు. దీనికి సమాధానం దొరికింది. చాలా రోజులుగా సోషల్ మీడియాలో అనసూయ వయసు ఇదే అంటూ చాలా సార్లు బయటికి వచ్చింది న్యూస్. అయితే అందులో ఎంతవరకు నిజముందో చెప్పడం కూడా కష్టమే. కానీ ఈ మధ్య తన వయసు గురించి అనసూయ ఓపెన్ అయిపోయింది. అది కూడా యాంకర్ సుమ సాక్షిగా. ఈ మధ్యే ఓ షోకు వచ్చిన ఈ ఇద్దరు స్టార్ యాంకర్స్ తమ వయసు గురించి చిక్కుముడి విప్పేసారు. ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన తర్వాత కూడా గ్లామర్ షోలో మాత్రం అనసూయ అదుర్స్ అనిపిస్తుంది. ఈ జబర్దస్త్ యాంకర్‌ను చూస్తుంటే తనకు కుళ్లు వచ్చేస్తుందని సుమ కూడా చెప్పింది.
అనసూయను చూస్తుంటే అసూయగా ఉంటుందని ఓపెన్‌గానే స్టేట్మెంట్ ఇచ్చింది సుమ కనకాల. ఇన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ తన వయసు చెప్పేసింది అనసూయ. చాలా మంది తన వయసును యిష్టమొచ్చినట్లు లెక్కలు కట్టారని.. ఒక్కొక్కరు అయితే 40 ఏళ్లకు పైగానే ఉంటుందని సోషల్ మీడియాలో రాసుకొచ్చారని చెప్పింది అనసూయ. కానీ వాళ్లంతా అనుకుంటున్నట్లు తన వయసు అంతగా ఏం లేదని చెప్పింది.
తనకు పాతికేళ్ల కంటే లోపే పెళ్లైపోయిందని.. ఇప్పుడు తన వయసు 34 అని ఓపెన్ అయిపోయింది. అంటే కేవలం 17 ఏళ్ల వయసులో నాగ సినిమాలో మెరిసింది. ఆ తర్వాత 24 ఏళ్లకు యాంకర్ అయినట్లు చెప్పింది. ప్రస్తుతం షోలతో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీ అయిపోయింది అనసూయ భరద్వాజ్. థ్యాంక్ యూ బ్రదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంది అనసూయ. ఈ సినిమాలో గర్భవతిగా నటిస్తుంది ఈ జబర్దస్త్ యాంకర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anasuya Bharadwaj, Telugu Cinema, Tollywood