హోమ్ /వార్తలు /సినిమా /

అనసూయ ఫ్యాన్‌ అయిన పాపానికి బండ బూతులు తిట్టారంట..

అనసూయ ఫ్యాన్‌ అయిన పాపానికి బండ బూతులు తిట్టారంట..

అనసూయ (Anasuya Bharadwaj)

అనసూయ (Anasuya Bharadwaj)

Anasuya Bharadwaj: సెలెబ్రిటీస్ అయిన తర్వాత ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తుంటాయి. రెండింటిని సమానంగా తీసుకోవాల్సిందే. ఇప్పుడు అనసూయ విషయంలో కూడా ఇదే జరుగుతుంది.

సెలెబ్రిటీస్ అయిన తర్వాత ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తుంటాయి. రెండింటిని సమానంగా తీసుకోవాల్సిందే. ఇప్పుడు అనసూయ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆమెను చాలా మంది ట్రోల్ చేస్తుంటారు.. విమర్శిస్తుంటారు. కానీ ఆమె మాత్రం తన పని తాను చేసుకుంటుంది. కానీ కొందరు మాత్రం అలాగే చేస్తుంటారు. అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్లలేమంటూ చెప్తుంది అనసూయ. అయితే ఇప్పుడు ఆమె అభిమాని ఒకరు సోషల్ మీడియాలో పెద్ద లేఖ రాసారు. అనసూయ అభిమాని ఒకరు ఆమె పేరుతో ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసాడు. అయితే ఈ క్రమంలోనే ఆయనతో పాటు అతడి కుటుంబ సభ్యులను కూడా ఇష్టమొచ్చినట్లు తిట్టారు కొందరు.

భర్తతో అనసూయ భరద్వాజ్ ఫోటోలు (anasuya bharadwaj/Twitter)
భర్తతో అనసూయ భరద్వాజ్ ఫోటోలు (anasuya bharadwaj/Twitter)

దాన్ని హైలైట్ చేస్తూ ఇప్పుడు లెటర్ రాసాడు ఆ ఫ్యాన్. హలో అనసూయ గారు.. ఎలా ఉన్నారు . మీరు చాలా గొప్పవాళ్ళు అంటూ మొదలు పెట్టాడు. నేను మీతో ఓ విషయం షేర్ చేసుకోవాలని మెసేజ్ పెడుతున్నాను.. మీ వరకు ఇది వస్తుందనే అనుకుంటున్నానంటూ రాసుకొచ్చాడు ఆ అభిమాని. అందులో మీ పేరుతో నేను ఓ అకౌంట్ ఓపెన్ చేసాను.. అది చూసి చాలా మంది ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు.. మధ్యలో ఏ సంబంధం లేని మా ఫ్యామిలీని కూడా తిట్టారు.. ఇది చాలా బాధ అనిపించింది అంటూ రాసుకొచ్చాడు.

ఇండస్ట్రీలో లేని మమ్మల్నే ఇంతగా తిడుతుంటే.. పాపం 12 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటున్న మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నారో.. మీ కుటుంబాన్ని ఎంతగా టార్గెట్ చేసారో తలుచుకుంటుంటేనే బాధేస్తుందని చెప్పుకొచ్చాడు ఆయన. ఇందులో మీకు అంతా సపోర్ట్ చేస్తున్నందుకు మీ భర్తతో పాటు తల్లిదండ్రులకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నాడు ఈ ఫ్యాన్. వాళ్లు మిమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తుండడంతో బాగా స్ట్రాంగ్ అవుతున్నారనే విషయం అర్తమైపోయిందని చెప్పాడు ఈయన. మీరే కాదు ఇండస్ట్రీలో ప్రతి నటున్ని కూడా ఇలాగే తిడుతుంటారు.. వాళ్ళ కుటుంబాలను తిట్టినపుడు ఆ బాధ తెలుస్తుందని చెప్పాడు ఈ ఫ్యాన్.

భర్తతో అనసూయ భరద్వాజ్ ఫోటోలు (anasuya bharadwaj/Twitter)
భర్తతో అనసూయ భరద్వాజ్ ఫోటోలు (anasuya bharadwaj/Twitter)

నిజంగా ఒకర్ని మీరు ఇష్టపడితే వాళ్ల స్థాయి పెంచాలే కానీ తగ్గించకూడదని చెప్పుకొచ్చాడు ఈ అభిమాని. ఇప్పుడు మీకు ఈ లేఖ రాసినందుకు నన్ను కూడా తిడతారు అయినా స్ట్రాంగ్ అవుతానంటూ చెప్పాడు. వాళ్ల మాటలు నేను అస్సలు పట్టించుకోను.. మీరు కూడా అస్సలు పట్టించుకోవద్దు.. జస్ట్ ఇగ్నోర్ చేయండి.. ఇంకా స్ట్రాంగ్‌గా ఉండండి.. మీకు మేం ఉన్నాం.. లవ్ యూ అనసూయ గారు అని అనసూయ అభిమాని తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

అభిమాని ట్వీట్‌కి స్పందించిన అనసూయ.. ఇది నన్ను బాధిస్తుంది.. ఏం చేయాలో నాకు అర్ధం కావడం లేదు.. ఇంత ప్రేమ మీరు నాకు ఇవ్వడానికి నేను మీకేం చేసానా అని అర్థం కావట్లేదంటూ రిప్లై ఇచ్చింది. నా వల్ల అనవసరంగా మీరు తిట్లు తింటున్నారు.. నేను చెప్పేది ఒక్కటే.. మీ చుట్టూ బలమైన వ్యక్తులు ఉన్నంత వరకు ఎవరేం చేయలేరు.. మీ యిష్టమొచ్చింది చేయండి అంటూ రాసుకొచ్చింది అనసూయ. మీరు అనుకున్నది సాధించే వరకు కృషి చేయండి అంటూ ట్వీట్ చేసింది అనసూయ.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anasuya Bharadwaj, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు