అనసూయ భరద్వాజ్‌ను బికినీలో చూడాలంటే అది జరగాల్సిందే..

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్.. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్ ఉన్న పేరు ఇది. ఇంకా చెప్పాలంటే కొందరు హీరోయిన్ల కంటే కూడా ఈమెకే క్రేజ్ ఎక్కువగా ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 29, 2020, 5:11 PM IST
అనసూయ భరద్వాజ్‌ను బికినీలో చూడాలంటే అది జరగాల్సిందే..
అనసూయ భరద్వాజ్ బికినీ (anasuya bharadwaj bikini)
  • Share this:
అనసూయ భరద్వాజ్.. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్ ఉన్న పేరు ఇది. ఇంకా చెప్పాలంటే కొందరు హీరోయిన్ల కంటే కూడా ఈమెకే క్రేజ్ ఎక్కువగా ఉంది. చేసిన సినిమాలు తక్కువే కానీ ఇమేజ్ మాత్రం భారీగానే ఉంది. అనసూయ అనే పేరు పాతదే కానీ ఆమె చేసే రచ్చ మాత్రం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తూ.. తనదైన యాంకరింగ్‌తో రప్ఫాడిస్తూ.. నటనతో మరిపిస్తూ దూసుకుపోతుంది అనసూయ భరద్వాజ్. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో నటనతో పాటు అక్కడక్కడా గ్లామరసం కూడా పండించింది. అయితే ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా శృతి మించిపోయి మాత్రం నటించలేదు.

అనసూయ భరద్వాజ్ హాట్ షో (Anasuya Bharadwaj hot)
అనసూయ భరద్వాజ్ హాట్ షో (Anasuya Bharadwaj hot)


క్షణం, రంగస్థలం, కథనం లాంటి సినిమాల్లో తనను పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసింది అనసూయ. ఆయా సినిమాల్లో అందాలు ఆరబోయాల్సిన అవసరం రాలేదు ఈ భామకు. అయితే ఇప్పుడు ఆ టైమ్ వచ్చినట్లే కనిపిస్తుంది. ఇప్పటి వరకు బుల్లితెరపై మాత్రం గ్లామర్ షో చేస్తూ వచ్చిన అనసూయ.. ఇకపై వెండితెరను కూడా వేడెక్కిస్తానని చెబుతుంది. ముఖ్యంగా బికినీ వేయడానికి కూడా తనకేం అభ్యంతరాలు లేవని చెబుతుంది ఈ బ్యూటీ. అభిమానులతో ముచ్చటిస్తూ తనను కొందరు ట్రోల్ కావాలని చేస్తుంటారని.. నిజానికి వాళ్లకు తన గురించి తెలియదని.. తెలిస్తే అలా ఎవరూ ట్రోల్ చేయరని చెప్పుకొచ్చింది.

అనసూయ భరద్వాజ్ హాట్ షో (Anasuya Bharadwaj hot)
అనసూయ భరద్వాజ్ హాట్ షో (Anasuya Bharadwaj hot)


సినిమాలలో అందాలు ఆరబోయడానికి తనకేం అభ్యంతరం లేదని క్లారిటీ ఇస్తూనే.. బికినీ గురించి ఓపెన్ అయిపోయింది అనసూయ. తనకు కూడా బికినీ వేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని.. అయితే బికినీ ధరించడానికి సూట్ అయ్యే బాడీ తనకు ఇప్పుడు లేదని స్పష్టం చేసింది. అందుకే బికినీకి దూరంగా ఉన్నానని.. అలాంటి సూట్ అయ్యే ఫిట్ బాడీ వచ్చినపుడు మాత్రం తప్పకుండా బికినీ వేసుకుంటానని తెలిపింది.

అనసూయ భరద్వాజ్ హాట్ షో (Anasuya Bharadwaj hot)
అనసూయ భరద్వాజ్ హాట్ షో (Anasuya Bharadwaj hot)


50కి చేరువలో ఉన్న మందిరా బేడీ, మలైకా అరోరా లాంటి వాళ్లే బికినీలు వేస్తున్నపుడు 30ల్లోనే ఉన్న అనసూయ మాత్రం బికినీ వేస్తే తప్పేంటి అంటున్నారు అభిమానులు కూడా. ప్రస్తుతం తెలుగులో వరస సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అన్నీ కుదిర్తే త్వరలోనే అనసూయ బికినీ ట్రీట్ చూడొచ్చన్నమాట. అన్నట్లు గతంలోనే కొడుకుతో ఉన్నపుడు స్విమ్ సూట్‌లో దర్శనం ఇచ్చింది అనసూయ. ఇప్పుడు ఏకంగా బికినీ కూడా వేస్తానంటుంది.
First published: April 29, 2020, 5:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading