Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: November 20, 2020, 10:04 PM IST
అనసూయ భరద్వాజ్ రానా దగ్గుబాటి (Anasuya Bharadwaj Rana Daggubati)
ఇటు బుల్లితెరపై.. అటు వెండితెరపై ఒకేసారి సత్తా చూపించడం అంటే మాటలు కాదు. దానికి చాలా టాలెంట్ కావాలి. అంత టాలెంట్ అనసూయ భరద్వాజ్ దగ్గర ఉంది. పేరు చివర భరద్వాజ్ ఉన్నా కూడా అనసూయ మాత్రం అద్భుతాలు చేస్తుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ ఇంత బాగా డిజైన్ చేసుకోవచ్చా అని మిగిలిన హీరోయిన్లు, యాంకర్స్ కుళ్లుకునేలా ఈమె దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమె వరస సినిమాలతో బిజీగా ఉంది. ఓ వైపు టీవీలో షోలు చేస్తూనే.. మరోవైపు నచ్చిన సినిమాలు కూడా ఒప్పుకుంటుంది. ఈ క్రమంలోనే అనసూయ తాజాగా థ్యాంక్ యూ బ్రదర్ అనే సినిమా చేస్తుంది. కొత్త దర్శకుడు రమేష్ రాపర్తి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైపోయింది. అశ్విన్ విరాజ్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా థ్యాంక్ యూ బ్రదర్ ఫస్ట్ లుక్ రానా దగ్గుబాటి విడుదల చేసాడు. తన స్నేహితుడు రమేష్ తెరకెక్కిస్తున్న సినిమా విజయం సాధించాలని ఆయన కోరుకున్నాడు.
అలాగే అనసూయ భరద్వాజ్‌కు కూడా ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కెరీర్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం అనసూయ దూసుకుపోతుంది. ఈమెకు జబర్దస్త్ పర్మినెంట్ షో.. దాంతో పాటు మరిన్ని షోలు కూడా చేస్తుంది ఈ జబర్దస్త్ యాంకర్. అవి మాత్రమే కాకుండా కథలు నచ్చినపుడు సినిమాలు కూడా చేస్తుంది ఈ బ్యూటీ. మొత్తానికి రానా దగ్గుబాటి చేసిన సాయం అనసూయ కెరీర్‌కు ఎలా హెల్ప్ అవుతుందో చూడాలి.
Published by:
Praveen Kumar Vadla
First published:
November 20, 2020, 10:04 PM IST